
అంతే కాకుండా వయసు పెరుగుతున్న కూడా వన్నె తరగని అందం త్రిష సొంతం అని చెప్పవచ్చు.ఇటీవల త్రిష 40వ పుట్టినరోజు వేడుకలను జరుపుకుంది.నాలుగు పదుల వయసు లో కి వచ్చినా కూడా ఇంకా పెళ్లి చేసుకోకుండా స్టిల్ బ్యాచిలర్ గానే ఉంటూ చెక్కుచెదరని అందం తో వరుస గా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది.ఇటీవలె పొన్నియన్ సెల్వన్-2 సినిమా తో ప్రేక్షకుల ను పలకరించిన విషయం తెలిసిందే.ఇందు లో తన అందం, స్క్రీన్ ప్రెజెన్స్ చూసి అభిమానులు మైమరిచి పోయారు.మధ్య కెరియర్ డౌన్ అవడం తో ఇక సినిమా లకు త్రిష దూరం అవడం ఖాయం అని అందరూ అనుకున్నారు.
కానీ ఆ తర్వాత మళ్లీ అవకాశాలను అందుకుంటూ దూసుకుపోవడం తో చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతి లో అరడజన్ కు పైగా సినిమాలు ఉన్నాయి.ఒక సినిమా ఇంకా పట్టాలెక్కక ముందే మరొక సినిమా కు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దూసుకుపోతోంది.ఇలా ఉంటే తాజా గా అందిన సమాచారం ప్రకారం అజిత్ హీరో గా మగిల్ తిరుమణి ఓ సినిమా రూపొందించ బోతున్నాడు.లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించబోతోంది.ఇందులో హీరోయిన్ గా త్రిష ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.