అక్కినేని అఖిల్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటుడు టాలీవుడ్ మాస్ దర్శకుడు వి వి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన అఖిల్ మూవీ తో హీరో గా వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయం అందుకుంది. ఆ తర్వాత ఈ నటుడు హలో , మిస్టర్ మజ్ను , మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తాజాగా ఏజెంట్ అనే మూవీ లలో హీరోగా నటించాడు. ఈ మూవీ లలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది.

తాజాగా అఖిల్ ... సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సాక్షా వైద్య హీరోయిన్ గా ... ఏ కే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర నిర్మించిన ఏజెంట్ అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ గా మిగిలింది. ఇది ఇలా ఉంటే అఖిల్ నటించిన ఒక ఫ్లాప్ మూవీ కథ మొదటగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వద్దకు వెళ్లిందట... కాకపోతే ఆ సినిమాను ప్రభాస్ కొన్ని కారణాల వల్ల రిజెక్ట్ చేశాడట. ఏజెంట్ మూవీ కథను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అందుకు రిజెక్ట్ చేశాడో తెలుసుకుందాం.

అఖిల్ తాజాగా ఏజెంట్ అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కథను మొదటగా సురేందర్ రెడ్డి ప్రభాస్ ను వినిపించాడట. అప్పటికే ప్రభాస్ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ... అంతకుమించిన స్థాయి ఉన్న కథలో నటిస్తూ ఉండడంతో ఈ కథకి అంతటి స్థాయి లేదు అనే ఉద్దేశంతో ప్రభాస్మూవీ ని రిజెక్ట్ చేశాడట. ఆ తర్వాత ఈ మూవీ దర్శకుడు అఖిల్ ని అదే కథ తో అప్రోచ్ కావడం... ఈ మూవీ కి అఖిల్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వీరి కాంబినేషన్ లో ఈ మూవీ రూపొందినట్లు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: