టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. బ్యాచిలర్ లైఫ్ని వీడి త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారు. అయితే గత కొన్ని నెలల క్రితం సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేస్తున్న రక్షిత రెడ్డి అనే అమ్మాయితో నిశ్చితార్థం జరిగింది.. జూన్ మూడవ తేదీన జైపూర్లో వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా అంతలోనే శర్వానంద్ కు యాక్సిడెంట్ కావడం జరిగింది. శర్వానంద్ ఇవాళ ఉదయం తెల్లవారుజామున యాక్సిడెంట్ జరిగినట్లుగా తెలుస్తోంది .హైదరాబాదులోని ఫిలిం నగర్ జంక్షన్ వద్ద ఈ రోజున తెల్లవారుజామున శర్వానంద్ రేంజ్ రోవర్ కారులో వెళుతూ ఉండగా ఒక్కసారిగా కారు బోల్తాపడడం జరిగిందట.


అయితే ఈ యాక్సిడెంట్ లో శర్వానంద్ కు గాయాలయ్యాయి కానీ ఎవరికి ఎలాంటి ప్రమాదం లేదని శర్వానంద్ టీం తెలియజేసింది. అలాగే ఆక్సిడెంట్ పై శర్వానంద్ కానీ అతని కుటుంబం కానీ ఇప్పటివరకు స్పందించలేదు.అయితే ఈ ప్రమాదంపై తాజాగా టీమ్ మాత్రం స్పందించినట్లు తెలుస్తోంది. శర్వానంద్ కారు ప్రయాణిస్తున్న సమయంలో ఫిలింనగర్ జంక్షన్ వద్ద అదుపుతప్పి ఈ ఘటన చోటుచేసుకుందని తెలిపారు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు అందరూ క్షేమంగానే ఉన్నారని తెలిపారు


కారుకు మాత్రం చిన్న గీత పడిందని ఈ ఘటన జరిగిన సమయంలో డ్రైవర్ అక్కడే ఉన్నారు.. చాలా స్వల్ప సంఘటన ఎవరు ఆందోళన పడాల్సిన పనిలేదు అంటూ కూడా తెలియజేశారు టీమ్. మరో వారం రోజుల్లో వివాహం ఉండగా ఇలా యాక్సిడెంట్ కావడంతో శర్వానంద్ త్వరగా కోలుకోవాలని అభిమానులైతే కోరుకుంటున్నారు. వరుస ప్లాపులతో సతమతమవుతున్న శర్వానంద్ కు.. చివరిగా తాను  నటించిన ఒకే ఒక జీవితం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం పలు చిత్రాలతో బిజీగా ఉంటున్న శర్వానంద్ కు ఇలా జరగడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. మరి ఈ ఏడాదైనా  శర్వానంద్  పలు చిత్రాలతో ప్రేక్షకులను మెప్పిస్తారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: