పాన్ ఇండియా సూపర్ స్టార్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా విడుదలకు రెడీగా ఉన్న లేటెస్ట్ చిత్రం ఆదిపురుష్.ఈ సినిమా ట్రైలర్ విడుదలైన తర్వాత దీనిపై అంచనాలు ఒక రేంజిలో పెరిగాయి. ఇంకా అలాగే పలు రకాల విమర్శలు కూడా ఈ సినిమాని వెంటాడటం జరిగింది.ఈ నేపథ్యంలో ఇటీవల విడుదలైన ట్రైలర్ ఇంకా జై శ్రీరామ్ పాట కాస్త సినిమా మీద డివోషనల్ యాంగిల్ ని పెంచడంతోపాటు మూవీపై మొదటి నుంచి వస్తున్న నెగిటివ్ టాక్ ని కాస్త కోస్తా తగ్గించింది అని చెప్పవచ్చు.అయితే తాజాగా విడుదల చేసిన ద సోల్ ఆఫ్ ఆదిపురుష్ పాట అయితే చిత్రం మీద మొత్తం నెగిటివీ పక్కన పెట్టింది.ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో విడుదల చేసిన ఈ పాట వినడానికి వీనుల విందుగా అందరిని ఆకట్టుకునే విధంగా ఉంది. సీత దూరమైన సందర్భంలో రాముడు పడిన బాధ అలాగే రాముడికి దూరమై సీత పడుతున్న వ్యధని చాలా అద్భుతమైన విజువల్స్ రూపంలో ఈ పాటలో చిత్రీకరించారు.


ద సోల్ ఆఫ్ ఆది పురుష్ నిజంగానే ద సోల్ ఆఫ్ సీతారామ అనే విధంగా చూసే వారిని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇంకా అలాగే ఎడబాటు తో సతమతమవుతున్న సీతారాముల మధ్య వారధిలా వ్యవహరించిన హనుమంతుడు ఒకరి గుర్తులను మరొకరికి చూపించడం వంటి విజువల్స్ అన్వేషాలు చాలా అందంగా ఉన్నాయి. ఇక రామాయణం అనేది అందరికీ తెలిసిన స్టోరీ అయినప్పటికీ అది ఎన్నిసార్లు చూసినా కూడా మనసుకు హత్తుకునే విధంగానే ఉంటుందని మరోసారి ఈ పాట నిరూపిస్తుంది.మొత్తానికి టీజర్ తో చాలా దారుణమైన నెగటివిటిని అందుకున్నది ఈ సినిమా. కానీ రీసెంట్ గా విడుదల అయిన ట్రైలర్ ఇంకా పాటలు అయితే చిత్రంపై ఉన్న హైప్ ను వేరే లెవెల్ కి తీసుకువెళ్ళింది అని చెప్పవచ్చు. జూన్ 16న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతోంది.ఇక ఈ సినిమా ఎలాంటి హిట్ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: