ఆదిపురుష్ నుంచి విడుదలై న పాట బాగా ఆకట్టుకుంటుంది.నువ్వు రాజకుమారివి జానకి. నువ్వు ఉండాల్సింది రాజ భవనంలో'' అని తనతో వనవాసానికి వస్తున్న జానకి ని రఘు రాముడు వారించే ప్రయత్నం చేస్తుంటే

నా రాఘవ ఎక్కడుంటే.. అదే నా రాజ మందిరం. మీ నీడైనా మిమ్మల్ని వదిలి వెళ్తుందేమో.. మీ జానకి వెళ్లదు'' అని పతి భక్తిని చాటుకుంటోందటా సీతమ్మ.

మరి ఈ సీతారాము ల కథ ఎలా సాగిందో తెలియాలంటే 'ఆదిపురుష్‌' మనం చూడాల్సిందే. రామాయణం ఆధారంగా ఓం రౌత్‌ తెరకెక్కించిన చిత్రమిది. రాఘవుడి గా ప్రభాస్‌ నటించగా.. జానకి పాత్రను కృతి సనన్‌ పోషించి న విషయం తెలిసిందే..

లంకేశుడి పాత్ర లో సైఫ్‌ అలీ ఖాన్‌ కనిపించనున్నారని తెలుస్తుంది.. ఈ సినిమా జూన్‌ 16న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందటా.ఈ నేపథ్యంలో నే ప్రచార పర్వాన్ని వేగవంతం చేసింది చిత్ర యూనిట్ ఇందు లో భాగంగా సోమవారం 'ద సోల్‌ ఆఫ్‌ ఆదిపురుష్‌' పేరుతో ''రామ్‌ సీతా రామ్‌..

సీతా రామ్‌ జయ జయ రామ్‌'' అనే గీతాన్ని విడుదల చేశారటా.ఈ పాట లో జానకికి దూరమై రాఘవుడు పడుతున్న వేదనను.. లంకలో జానకి పడుతున్న వ్యథను.. ఆమె జాడ తెలుసుకునే క్రమంలో హనుమ చేసిన సాయాన్ని..

మనసుకు హత్తుకునే లా అయితే చూపించారు. ఈ పాటకు సచేత్‌ - పరంపర స్వరాలు సమకూర్చ గా.. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారని తెలుస్తుంది.. కార్తీక్‌, సచేత్‌ టాండన్‌, పరంపర టాండన్‌ సంయుక్తం గా ఆలపించార ని సమాచారం.. ఈ చిత్రం పాన్‌ ఇండియా భాషలతో పాటు పలు విదేశీ భాషల్లోనూ ఒకేసారి విడుదల కానుందని తెలుస్తుంది..ఆదిపురుష్ సినిమా పై మొదట నెగటివ్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే. కానీ రీసెంట్ గా విడుదల చేసిన ట్రైలర్ అందరిని బాగా ఆకట్టుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: