పవన్ కళ్యాణ్ కు సినిమాల్లో బాగా సంపాదించుకునే అవకాశం ఉన్న కూడా స్వచ్ఛమైన రాజకీయాలు చేయాలనే ఉద్దేశంతో అటు వైపు అడుగులు వేసి ఎంతగానో పోరాటం చేస్తున్నారు. రాజకీయాల్లోకి వచ్చాక ఆయనపై మాటల దాడి చేస్తున్నారు.. అయితే చాల మంది అయన పై వేసే ఒక నింద మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు అని, అమ్మాయిలను మోసం చేస్తున్నాడు అని. కానీ అయన మనసుకే తెలుసు ఏ పెళ్లి ఎలాంటి గాయం చేసిందో.

ఎందుకు తాను మూడు సార్లు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో ఎవరికీ చెప్పాల్సిన అవసరం అయితే లేదు. మూడు పెళ్లిళ్ల వల్ల అతడు ఆడవారికి రెస్పెక్ట్ ఇవ్వడు అని చాల చెత్త కామెంట్స్ కూడా చేస్తూ ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ అలాంటి వ్యక్తి కాదు. అలాంటి వ్యక్తి కనుక అయ్యి ఉంటె ఈ రోజు ఆయనకు ఇంత లేడీ ఫాలోయింగ్ ఉండేది కాదు. చివరికి అయన రెండవ భార్య రేణు దేశాయ్ కూడా పవన్ కళ్యాణ్ చాల మంచి వాడు అంటూ ఆమె ఇంటర్వూస్ లో చెప్తుంది. ఇక మరొక ఉదాహరణ చెప్పాల్సి వస్తే పవన్ కళ్యాణ్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చాక మొదటి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. ఈ సినిమా తర్వాత తీసిన సినిమా గోకులం లో సీత. అయితే ఈ చిత్రానికి హీరో పవన్ కళ్యాణ్ అయినప్పటికి టైటిల్ మాత్రం హీరోయిన్ పేరు మీద ఉంటుంది. అతడు తలుచుకుంటే ఒక్క నిమిషం కూడా పట్టదు సినిమా పేరు మార్చుకోవడానికి. కానీ పవన్ కళ్యాణ్ అస్సలు ఏమి అనలేదు. అందుకే అయన ఈ రోజు పవర్ స్టార్ అయ్యాడు అంటూ ఈ మధ్య ఒక ఇంటర్వ్యూ లో తన అనుభవాన్ని పంచుకున్నారటా గోకులం లో సీత హీరోయిన్ అయిన రాశి. అంత పెద్ద ఇంటి నుంచి వచ్చిన ఎంతో అనుకువగా ఉండేవారని, ఎవరితో ఎక్కువగా మాట్లాడేవారు  కాదని ఆమె చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: