ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో కోట్లల్లో రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఇక హవా నడిపిస్తున్న ఎంతో మంది స్టార్ హీరోలు .. అటు సరికొత్త వ్యాపారాలు ప్రారంభిస్తూ  బిజినెస్ లోను అదరగొడుతున్నారు. మెగాస్టార్  తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాల్లో స్టార్ హీరోగా కొనసాగుతూనే ఇక బిజినెస్ లో కూడా కింగ్ గా హవా నడిపిస్తున్నాడు. అయితే అచ్చం రామ్ చరణ్ తలహాలోనే అటు అల్లు అర్జున్ కూడా స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది.


 భారీ రేంజ్ లోనే రెమ్యూనరేషన్ తీసుకుంటున్న అల్లు అర్జున్ ఇలా సినిమాల ద్వారా సంపాదించిన మొత్తాన్ని కూడా ఎంతో తెలివిగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే థియేటర్ బిజినెస్ లోకి కూడా అడుగు పెట్టేందుకు సిద్ధమవుతున్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అమీర్పేట్ లో ఉన్న సత్యం థియటర్ స్థానంలో ఏషియన్ సంస్థ భాగస్వామ్యంతో ఏఏఏ సినిమాస్ పేరుతో బన్నీ మల్టీప్లెక్స్ నిర్మించేందుకు పూనుకున్నాడు. అయితే ఈ మల్టీప్లెక్స్ ఎప్పుడు ఓపెన్ అవుతుందా అని అటు అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు  అని చెప్పాలి. అయితే ఈ మల్టీప్లెక్స్ ఒక భారీ సినిమా తోనే ఓపెన్ కాబోతుంది అన్నది తెలుస్తుంది. ఆ సినిమా ఏదో కాదు ప్రభాస్ హీరోగా నటించిన ఆది పురుష్. ఇక ప్రభాస్ చేతుల మీదుగా ఈ మల్టీప్లెక్స్ ఓపెన్ కానుందని ప్రస్తుతం ఒక ప్రచారం జరుగుతుంది. అయితే ఈ మల్టీప్లెక్స్ లో ఎన్నో స్పెషాలిటీలు ఉండబోతున్నాయట. ఇక త్వరలోనే ఈ మల్టీప్లెక్స్ ప్రత్యేకతల గురించి అన్ని వివరాలను కూడా వెల్లడించబోతున్నారు అన్నది తెలుస్తుంది. ఇలా పూర్తి వివరాలు తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇకపోతే ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో బిజీబిజీగా ఉన్నాడు అని చెప్పాలి. 500 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక పుష్ప 2 సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద గర్జించాలని ప్లాన్ చేస్తున్నాడు అల్లు వారి వారసుడు అర్జున్.

మరింత సమాచారం తెలుసుకోండి: