తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంత మంది దర్శకులు ఉన్నప్పటికీ డైరెక్టర్ తేజ కి మాత్రం ఎప్పుడు ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. ఎందుకంటే డైరెక్టర్ తేజ ఇప్పటివరకు ఎంతోమంది నటులను హీరోలుగా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. తన సినిమాలతో ఒకానొక సమయంలో హవా నడిపించారు అని చెప్పాలి. అయితే డైరెక్టర్ తేజ ఇంకా ఓల్డ్ ఫార్ములానే పట్టుకుని వేలాడుతున్నారు అంటూ విమర్శలు వస్తున్న తన పంత మాత్రం వీడకుండా తనదైన శైలిలోనే సినిమాలు చేస్తూ పోతున్నారు డైరెక్టర్ తేజ. ఇక ఇప్పటికే ఎంతోమంది హీరోలను ఇండస్ట్రీకి పరిచయం చేసిన తేజ ఇక ఇప్పుడు స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు రెండో కుమారుడు అభిరామ్ ను హీరోగా పరిచయం చేయబోతున్నాడు. అభిరామ్ హీరోగా అహింస అనే సినిమాను తెరకెక్కించాడు డైరెక్టర్ తేజ. ఇక ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతుండగా ప్రమోషన్స్ లో ప్రస్తుతం బిజీబిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే తన వ్యక్తిగత జీవితం గురించి తన ప్రొఫెషనల్ లైఫ్ గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ తేజ కాంబినేషన్లో పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆ తర్వాత ఆగిపోయిన సినిమా గురించి ఆసక్తికర విషయాన్ని బయట పెట్టాడు డైరెక్టర్ తేజ. ఎన్నో రోజులుగా పవన్ కళ్యాణ్తో సినిమా చేయాలనుకున్నాడట తేజ. అయితే ఏ హీరో కోసం రాయని విధంగా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ని రెడీ చేశాడట. ఎంతో ఉత్సాహంగా ఈ కథను పవన్ కళ్యాణ్ కు వినిపించాడట. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం స్టోరీ నచ్చలేదు అంటూ తేజ మొహం మీద చెప్పేశాడట. అయితే ఇక అదే కథను మరోసారి హీరోతో చేసి డిజాస్టర్ సొంతం చేసుకున్నాడు తేజ. ఇంతకీ తేజ పవన్ కళ్యాణ్ తో చేయాలనుకున్న సినిమా ఏదో తెలుసా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన నిజం సినిమా.  అయితే ఈ సినిమా ఫ్లాప్ అవుతుందని ముందుగానే ఊహించిన పవన్ కళ్యాణ్ సినిమాను రిజెక్ట్ చేశాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: