జబర్దస్త్ ,ఎక్స్ ట్రా జబర్దస్త్ కామెడీ షోలకు మంచి క్రేజ్ ఉంది.. వీటి ద్వారా ఎంతోమంది కమెడియన్స్ షోలకి ఎంట్రీ ఇచ్చి మంచి పాపులారిటీ సంపాదించారు. ఈ షోల వల్ల ఎంతమంది ఇండస్ట్రీలోకి కూడా ఎంట్రీ ఇచ్చి కమెడియన్లుగా హీరోగా పలు సినిమాలలో నటిస్తూ ఉన్నారు. జబర్దస్త్ చాలామందికి లైఫ్ ఇచ్చిందని కూడా చెప్పవచ్చు. సోషల్ మీడియాలో జబర్దస్త్ నటీనటులకు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. ఈ షో ద్వారా సంపాదించిన చాలామంది కమెడియన్ ఇల్లు కార్లు పొలాలు వంటివి కొనుక్కోవడం జరిగింది.


మరి కొంతమంది సొంతగా యూట్యూబ్ ఛానల్స్ ని ఏర్పాటు చేసి చేతినిండా డబ్బులు సంపాదిస్తూ ఉన్నారు. వీరికి సంబంధించి ఎలాంటి విషయమైనా సరే ఇట్టే వైరల్ గా మారుతూ ఉంటుంది. ముఖ్యంగా పర్సనల్ లైఫ్ గురించి ఏదైనా విషయాలు వచ్చాయి అంటే చాలు అవి ట్రెండీగా నిలుస్తూ ఉంటాయని చెప్పవచ్చు. ఇదంతా ఇలా ఉండగా త్వరలో జబర్దస్త్ కమెడియన్ వివాహం చేసుకోబోతున్నారని విషయాన్ని తెలియజేయడం జరిగింది . వాటి గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.


అసలు విషయంలోకి వెళ్తే జబర్దస్త్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించిన కమెడియన్ కెవ్వు కార్తీక్ త్వరలో వివాహం చేసుకోబోతున్నారని తన కాబోయే భార్యతో కలిసి ఉన్న కొన్ని ఫోటోలను సైతం సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది.. ఈ ఫోటోలకు క్యాప్షన్ గా మీ జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి వస్తే లైఫ్ ఎలా సంతోషంగా ఉంటుందని కొంతమంది చెబుతూ ఉంటారు బహుశా ఇది అదే కావచ్చు అంటూ తెలియజేస్తూ నా జీవితంలో వస్తున్నందుకు థాంక్యూ బ్యూటిఫుల్ అంటూ ఒక కొటేషన్ ని రాసుకొచ్చారు కెవ్వు కార్తీక్. ప్రస్తుతం వీరికి సంబంధించి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. అయితే అమ్మాయి ఎవరు ఎప్పుడు వివాహం అనే విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: