ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాలలో బ్రో సినిమా కూడా ఒకటి. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ తో పాటు సాయి ధరంతేజ్ కూడా నటిస్తూ ఉన్నారు .ఈ సినిమాని నటుడు డైరెక్టర్ సముద్రఖని డైరెక్షన్  చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా దాదాపుగా పూర్తి అయినట్టుగా తెలుస్తోంది. కేవలం ఇందులో రెండు సాంగ్స్ మాత్రమే పెండింగ్ ఉన్నట్లుగా సమాచారం. అందులో ఒకటి స్పెషల్ సాంగ్ ఉండబోతోంది అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ స్పెషల్ సాంగ్ కోసం చిత్ర బృందం భారీగానే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.


బ్రో సినిమాలోని ఈ సాంగ్ కోసం స్టార్ హీరోయిన్ ని ఎంపిక చేయబోతున్నట్లు తెలుస్తోంది.అందుకే రకుల్ ప్రీతిసింగ్ అని సంప్రదించగా అందుకు ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. బ్రో సినిమాలోని స్పెషల్ సాంగ్ను ఈ సోమవారం నుంచి మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.. కానీ ఆమె డేట్లు అడ్జస్ట్ కాలేకపోవడంతో  ఈ పాటని మరొక షెడ్యూల్లో చేయమని చెప్పినట్టుగా తెలుస్తోంది. దీంతో చిత్ర బృందం డైలమాల పడినట్టుగా తెలుస్తోంది ఒకవేళ రకుల్ ప్రీతిసింగ్ కు డేట్లు అడ్జస్ట్ కాలేకపోతే మరొక నటిని తీసుకువచ్చేందుకు కూడా పలు సన్నహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది చిత్ర బృందం.


కానీ అభిమానులు మాత్రం రకుల్ ప్రీతిసింగ్ అయితే ఈ పాటకి కరెక్ట్ గా సెట్ అవుతుందని ఇద్దరు హీరోల ఎనర్జీ  ని ఆమె తట్టుకొని డాన్స్ వేయగలరు అంటూ అభిమానుల సైతం కామెంట్లు చేస్తున్నారు. మరి రకుల్ ప్రీతిసింగ్ బ్రో సినిమాలో ఉంటుందా లేదా అనే విషయంపై ఇంకా చిత్ర బృందం క్లారిటీ ఇవ్వలేదు. ఒకవేళ ఈ ముద్దుగుమ్మ నో చెప్పే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మరొక హీరోయిన్ ని ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ స్పెషల్ సాంగ్ పైన ఎవరు స్పందిస్తారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: