మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ గురించి ఇక్కడ ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన అవసరం లేదు. తేజ్ అంటే ఇండస్ట్రీలో చాలా  మందికి ఇష్టం. చాలామందితో మంచి సత్సంభాలను కలిగి ఉంటాడు. దాదాపుగా అందరితోనూ స్నేహంగా ఉంటాడు. ఓ మాట అని ఇతరులను హర్ట్ చేయడం అతనికి నైజం రాదు. ఇక సాయి ధరమ్ తేజ్ చేసిన సోషల్ సర్వీసులు గురించి చెప్పాల్సిన పనిలేదు. ఆ విషయంలో మామలకు తగ్గ అల్లుడే అని చెప్పుకోకతప్పదు. నమ్మిన వాళ్ళను మోసం చేసే రకం అస్సలు కాదు.

అలాంటి సాయి ధరమ్ తేజ్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం జరుగుతుంది. విషయంలోకి వెళితే.. 'సాయి ధరమ్ తేజ్ కు అతని మేనేజర్ కు మధ్య మాటల యుద్ధం జరిగిందని, దీంతో అతని మేనేజర్ ఉద్యోగం మానేశాడని, అందువల్ల తన తల్లి సూచన మేరకు తన సామజిక వర్గానికి చెందిన ఓ వ్యక్తిని మేనేజర్ గా పెట్టుకున్నట్టు ప్రచారం గుప్పుమంది. అయితే ఇది ప్రచారం మాత్రమే.. అయితే అసలు విషయం ఏమంటే అతన్ని ఎంతో గానో నమ్మాడట మన మెగా మేనల్లుడు. అందుకోసం తన 'విరూపాక్ష' ఉత్తరాంధ్ర రైట్స్ కూడా అతనికే ఇప్పించాడని టాక్.

అయితే సినిమా అక్కడ బాగా ఆడింది. రూ.7 కోట్ల పైనే వసూళ్లు రాబట్టింది. కానీ ఖర్చులు పోగా అక్కడ మిగిలింది ఏమీ లేదు అని నిర్మాతలు అతగాడికేమి చెల్లించలేదట. దీంతో ఇద్దరి మధ్య ఎక్కువ చర్చలు నడిచాయి. ఈ క్రమంలో తన లైఫ్ ఎలాగు సెట్ అయిపోయినట్టే కాబట్టి.. ఉద్యోగం మానేసి వెళ్ళిపోయాడు సదరు మేనేజర్. ఈ విషయాన్ని బయటకు రానివ్వకుండా.. ఆ మేనేజర్ వేరే విధంగా ప్రచారం చేయిస్తుండడం ఇపుడు హాట్ టాపిక్ గా మారింది. సాయి ధరమ్ తేజ్ నిజానికి వివాదాలకు చాలా దూరంగా ఉంటాడు. ఇప్పుడు కూడా అదే చేస్తున్నాడు అని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: