పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మరియు యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్‍ కలిసి నటిస్తున్న బ్రో సినిమాపై భారీ అంచనాలు అయితే ఉన్నాయి. సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై చాలా బజ్ క్రియేట్ అయింది.

ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ ఈ చిత్రానికి రచయితగా కూడా ఉన్నారు. తమిళంలో హిట్ అయిన వినోదయ సితంకు రీమేక్‍గా ఈ 'బ్రో' మూవీ తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ తుది దశకు అయితే చేరుకుంది. కాగా, తాజాగా బ్రో సినిమా గురించి మరో అప్డేట్ బయటికి వచ్చింది. ఈ మూవీలోని స్పెషల్ సాంగ్‍లో ఓ బాలీవుడ్ బ్యూటీ చిందేస్తుందని సమాచారం.

బ్రో చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ ఊశ్వరి రౌతేలా స్పెషల్ సాంగ్ చేస్తుందని సమాచారం.ఓ ప్రత్యేక గీతంలో ఆమె చిందేస్తుందని వార్త బయటికి వచ్చింది. ఇందుకు సంబంధించి ఊహాగానాలు కూడా జోరందుకున్నాయి. అయితే, ఈ విషయంపై చిత్రయూనిట్ నుంచి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. అయితే రౌతేలా పేరును ఖరారు చేసినట్టు వాదనలు కూడా ఊపందుకున్నాయి. త్వరలోనే షూటింగ్‍కు ఊర్వశి హాజరవుతుందని సమాచారం..

వాల్తేరు వీరయ్య సినిమాలో బాస్ పార్టీ పాటలో ఊర్వశీ రౌతేలా.. మెగాస్టార్ చిరంజీవి పక్కన స్పెషల్ సాంగ్ చేసింది. ఈ బాస్ పార్టీ పాట పెద్ద హిట్ అయింది. అలాగే అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ఏజెంట్ సినిమాలో కూడా స్పెషల్ సాంగ్‍లో అదరగొట్టింది ఊర్వశి. ఇప్పుడు బ్రో సినిమాతో టాలీవుడ్‍లో ఈ ఏడాది మూడో స్పెషల్ సాంగ్ ను ఊర్వతీ రౌతేలా చేయనుందని సమాచారం.రామ్ - బోయపాటి చిత్రంలోనూ ఊర్వశీ స్పెషల్ సాంగ్ చేయబోతుంది  

బ్రో సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం శ్రుతి హాసన్ మరియు దిశా పటానీ పేర్లు ఇటీవల అయితే వినిపించాయి. అయితే, ఊర్వశీ రౌతేలాకే చిత్రయూనిట్ మొగ్గుచూపినట్టు సమాచారం.అయితే ఈ విషయంపై ఇంకా స్పష్టత మాత్రం రాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: