సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మహేష్ ఇప్పటి వరకు తన కెరీర్ లో ఎన్నో విజయవంతమైన సినిమా లలో హీరోగా నటించాడు. అందులో మహేష్ నటించిన ఎన్నో సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలను సాధించడంతో ప్రస్తుతం మహేష్ టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోలలో ఒకరిగా కెరీర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే పవన్ తన కెరీర్ లో కొన్ని ఫ్లాప్ లను కూడా తన కెరియర్ లో అందుకున్నాడు. అలా పవన్ రిజెక్ట్ చేసిన ఒక స్టోరీని సెలెక్ట్ చేసుకున్న మహేష్ ఆ సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఫ్లాప్ ను అందుకున్నాడు.

మూవీ ఏమిటి ... ఆ విశేషాలు ఏమిటో తెలుసుకుందాం. తెలుగు సినిమా ఇండస్ట్రీ లో చిత్రం , జయం , నువ్వు నేను మూవీ లతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ దర్శకుల్లో ఒకరిగా కెరియర్ ను కొనసాగించిన తేజ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన టాలీవుడ్ టాప్ దర్శకుల్లో ఒకరిగా కెరీర్ ను కొనసాగిస్తున్న సమయంలో పవన్ తో మూవీ చేయాలి అని అనుకున్నాడట. అందులో భాగంగా పవన్ కు ఒక స్టోరీని కూడా వినిపించాడట. కాకపోతే ఆ స్టోరీ మొత్తం విన్న పవన్ ఈ మూవీ అసలు వర్కౌట్ కాదు అని చెప్పాడట.

అయినప్పటికీ ఆ కథపై పూర్తి నమ్మకం ఉన్న తేజ ఇదే కథను మహేష్ కు చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇప్పించుకొని మూవీ ని రూపొందించాడట. అదే నిజం మూవీ. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అపజయాన్ని అందుకుంది. అలా పవన్ రిజెక్ట్ చేసిన స్టోరీని సెలెక్ట్ చేసుకుని మహేష్ భారీ ఫ్లాప్ ను అందుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: