సుమంత్ ప్రభాస్ అనే యువ నటుడు తాజాగా మేము ఫేమస్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఇతను ఈ మూవీ లో హీరోగా నటించడం మాత్రమే కాకుండా ఈ సినిమాకు దర్శకత్వం కూడా వహించాడు. ఈ మూవీ తోనే ఈయన తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా విడుదలకు ముందే ఈ మూవీ నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దానితో ఈ మూవీ మంచి అంచనాలు నడుమ ధియేటర్ లలో విడుదల అయింది. ఇప్పటి వరకు ఈ సినిమా 9 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ తొమ్మిది రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ను వివరాలను తెలుసుకుందాం.

మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 86 లక్షల కలెక్షన్ లను వసూలు చేయగా , 2 వ రోజు 79 లక్షలు , 3 వ రోజు 76 లక్షలు , 4 వ రోజు 41 లక్షలు , 5 వ రోజు 37 లక్షలు , 6 వ రోజు 33 లక్షలు , 7 వ రోజు 27 లక్షలు , 8 వ రోజు 24 లక్షలు , 9 వ రోజు 33 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది. మొత్తంగా ఈ సినిమా 9 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపు కొని 2.18 కోట్ల షేర్ ... 4.35 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ 9 రోజుల్లో ఈ సినిమా రిమైనింగ్ ప్రాంతాల్లో 1.31 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. మొత్తంగా 9 రోజులకు గాను ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 2.75 కోట్ల షేర్ ... 5.66 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇప్పటికి కూడా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ వసూళ్లను రాబడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: