'అఖండ' వంటి భారీ విజయం తర్వాత  సంక్రాంతి బరిలో దిగి 'వీరసింహా రెడ్డి'తో తిరుగులేని విజయాన్ని సాధించాడుబాలయ్య ఈ సినిమా ప్రీమియర్ షోల నుంచి డివైడ్‌ టాక్‌ ను తెచ్చుకుంది. కానీ టాక్‌తో సంబంధంలేకుండా కలెక్షన్‌ల వరద అయితే పారింది.

ఇప్పుడున్న సీనియర్‌ హీరోలలో బాలకృష్ణ హవా బాగా నడుస్తుంది.. ఇక ప్రస్తుతం బాలయ్య హ్యట్రిక్‌ కోసం ట్రై చేస్తున్నాడు. ఇక బాలయ్య ప్రస్తుతం అనిల్‌ రావిపూడితో సినిమా ను చేస్తున్నాడు. అవుట్‌ అండ్ అవుట్‌ భారి యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీ ఇప్పటికే సగం షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుంది. శ్రీలీల కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం.ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య చేయబోయే సినిమాపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ అయితే లేదు. ఓ వైపు ఆదిత్య 999 పనులు చక చకా జరిగిపోతున్నా కానీ .. ఈ సినిమాకు దర్శకుడు కూడా బాలయ్యనే కానుండటంతో కొద్దిగా లేటయ్యేలా కనిపిస్తుంది.

ఇక మరోవైపు పూరితో రెండో సినిమా కమిట్ అయినట్లు కూడా వార్తలు వచ్చినా.. ఇటీవలే పూరి ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ ను ప్రకటించడంతో అది కాస్త లేట్ అయ్యేలానే కనిపిస్తుందటా.కాగా ఈలోగ మరో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. ఇటీవలే వాల్తేరు వీరయ్యతో చిరుకు తిరుగులేని విజయాన్నిచ్చిన బాబీతో బాలయ్య తన నెక్స్ట్ సినిమా చేయబోతున్నట్లు గా తెలుస్తుంది. ఇటీవలే బాబీ చెప్పిన కథ బాగా నచ్చడంతో బాలయ్య కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. ఇక ఈ సినిమాను సితార సంస్థ నిర్మించనున్నట్లు తెలుస్తుంది. దానికి తోడు తాజాగా ప్రొడ్యూసర్ నాగవంశీ జూన్ 10న బిగ్ అప్డట్ రానున్నట్లు కూడా ఓ లయన్ ఎమోజీని పెట్టాడు. దాంతో బాలయ్యతో సినిమా చేస్తున్నట్లు హింట్ ను కూడా ఇచ్చాడు. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన పూర్తి విషయాలు త్వరలో వెల్లడి కానున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: