టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా సినిమా గుంటూరు కారం. మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న మూడవ సినిమా ఇదే. కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్స్ మరియు ఒక చిన్న గ్లింప్స్ వీడియో ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేసాయి. అయితే ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ అండ్ వీడియో గ్లిమ్ప్స్ వీడియో విడుదలై ఎంతటి క్రేజ్ ను అందుకున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 

గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన అతడు ఖలేజా సినిమాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో ఈ సినిమా వస్తుంది .దీంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ బజ్ క్రియేట్ .అయింది ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్డే మరియు శ్రీ లీలా హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక తాజా వార్త  సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అదేంటంటే ఈ సినిమాను ముందుగా త్రివిక్రమ్ మరొక స్టార్ హీరో కోసం అనుకున్నారు అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే మహేష్ బాబు హీరోగా నటిస్తున్న గుంటూరు కారం సినిమాను ముందుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో తీయాలని అనుకున్నాడట మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్.

కానీ ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ వరుస సినిమాలతో బిజీగా ఉండడంతో మహేష్ బాబుని ఈ సినిమా కోసం ఫైనల్ చేశాడట గురుజి. ప్రస్తుతం ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ క్రమంలోనే ఈ వార్త విన్న చాలా మంది ఈ వార్తలు ఎలాంటి నిజం లేదని త్రివిక్రమ్ గుంటూరు కారం సినిమా మహేష్ బాబు కోసమే రాసుకున్నాడని అంటున్నారు. ఇక గతంలో త్రివిక్రమ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత సినిమా ఎంత విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం సినిమా తర్వాత త్రివిక్రమ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో సినిమా వస్తే కూడా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని అంటున్నారు. ఇక ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో చేస్తున్నాడు. ఈ సినిమా అనంతరం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు ఎన్టీఆర్ .!!

మరింత సమాచారం తెలుసుకోండి: