వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమా భోళా శంకర్. మెహర్ రమేష్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకి అనిల్ సుంకర నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక అనిల్ సుంకర నిర్మించిన గత చిత్రం డిజాస్టర్ గా మిగలడంతో ఈ సినిమాతో అయినా సక్సెస్ సాధించాలని చూస్తున్నారు ఆయన. అయితే ఎంతోకాలంగా సినీ ఇండస్ట్రీలో ఒక ఆనవాయితీ నడుస్తుంది. అది ఏంటంటే సినిమా ఫ్లాప్ అయ్యి నష్టాలు వస్తే నిర్మాత ఖచ్చితంగా ఎంతో కొంత నష్టపరిహారం చెల్లించాలి అని అంటారు. అయితే సెంటిమెంట్లు అనేవి పర్ఫెక్ట్ గా ఉండాలి లేకపోతే డిస్ట్రిబ్యూటర్ లో మళ్ళీ గొడవ చేస్తారు. 

ప్రస్తుతం అదే పనిలో ఉన్నాడు అనిల్ సుంకర. సాధారణంగా ఆయన ఎవరి దగ్గర నుండి ఒక రూపాయి కూడా తీసుకోరు. ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చేస్తాడు. అనే మంచి పేరు ఆయనకి ఎప్పటినుండో ఉంది కాబట్టి వచ్చే సినిమాలో అడ్జస్ట్ చేస్తాను అంటే బ్యానర్స్ ఒప్పుకోవాలి. ఇంతకుముందు వరకు సినీ ఇండస్ట్రీలో అలాగే జరిగేది. కానీ ఇప్పుడు ఆయన మాట ఎవరు వినడం లేదని వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే భోళాశంకర్ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు అంతగా నమ్మకం లేదు. దానికి కారణం కూడా లేకపోలేదు అని అంటున్నారు. అందుకోసం నిర్మించిన ముందు సినిమా లో హిట్ అయితే గనక ఆయన్ని నమ్మేవారు. కానీ ఆయన నిర్మించిన గత సినిమాలో ఫ్లాప్ అవడంతో

ఇప్పుడు ఆయన్ని ఎవరు నమ్మడం లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం స్క్రిప్ట్ కూడా లేకుండా ఆ సినిమా దర్శకుడు చేసిన పొరపాటు వల్లే ఇదంతా జరిగిందని అంటున్నా.రు ఇక ఆ సినిమా చేసిన డైరెక్టర్ కూడా గతంలో  చిరు తో ఒక సినిమా చేసిన వ్యక్తి. ఇక ఆ సెట్స్ లో చెప్పింది వినకుండా ఏదేదో చేసేవాడట .అందుకు ఫలితం కూడా ఒక మాదిరిగా వచ్చింది. అంతేకాదు అనవసరమైన సన్నివేశాలను చిత్రీకరించి బడ్జెట్ పెంచేసాడు అన్న వార్తలు కూడా అప్పట్లో జోరుగా వినిపించాయి. అయితే తాజాగా ఇప్పుడు మళ్ళీ ఆదర్శకుడి వల్లే చిరు సినిమాకి సమస్యలు వచ్చి పడ్డాయి అని అంటున్నారు. దీంతో ఆ డైరెక్టర్ ఇప్పుడు చిరుకి తలనొప్పిగా మారాడు అన్న వార్తలు వినబడుతున్నాయి ..!!

మరింత సమాచారం తెలుసుకోండి: