నటసింహం నందమూరి బాలకృష్ణ ఇటీవల  అఖండ వీర సింహారెడ్డి వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన 108వ సినిమాని పూర్తి చేసే పనిలో ఉన్నాడు బాలకృష్ణ. ఇక ఈ సినిమా తర్వాత వెంటనే తన 109వ సినిమాని బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తున్నాడు అంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే ముందుగానే బాలయ్య బోయపాటి నాలుగవ ప్రాజెక్ట్ ని ప్రకటించాలని అనుకున్నారు. అది కూడా బాలయ్య పుట్టినరోజు సందర్భంగా జూన్ 10న. కానీ ఇప్పుడు లెక్కలు మారిపోయాయి. 

తాజాగా అందుతున్న సమాచారం మేరకు బోయపాటి శ్రీను మరియు నందమూరి బాలకృష్ణ కాంబినేషన్లో సినిమా రావడం లేదు అని అంటున్నారు. ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్ ఆగిపోయిందని సమాచారం. ఈ క్రమంలోనే బోయపాటి శ్రీను స్థానంలో డైరెక్టర్ బాబి వచ్చినట్లుగా తెలుస్తోంది. బాలయ్య తన 109వ సినిమాని బాబీ దర్శకత్వంలో చేయబోతున్నాడని తెలుస్తోంది. అయితే 2024 ఎన్నికల సమయంలో బాలయ్య బోయపాటి కాంబినేషన్లో సినిమా లేనట్టేనా అని అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది. టిడిపికి మైలేజ్ చేకూరేలా ఓ సినిమా చేస్తారు అని అందరూ భావిస్తున్న సమయంలో అది సాధ్యమయ్యే అవకాశాలు కనిపించడం లేదు.

దానికి కారణం కూడా లేకపోలేదు.. ఎందుకంటే అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య చేస్తున్న సినిమా షూటింగ్స్ సెప్టెంబర్ వరకు ఉంటుంది .ఈ క్రమంలోనే బోయపాటి శ్రీను రామ్ తో చేస్తున్న సినిమాకి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యే దశకు వచ్చింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనిలో పడ్డాడు బోయపాటి. అక్టోబర్ లో ఈ రెండు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఈ క్రమంలోనే బాలకృష్ణ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని బాబి కి ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే బోయపాటి శ్రీను తన నెక్స్ట్ సినిమాని ఏ హీరోతో చేస్తాడు అన్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: