పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా నటించిన ఆది పురుష్ సినిమా మరికొద్ది రోజుల్లో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమా విడుదలకు ముందు విడుదలైన తర్వాత కూడా సంచలనాలను సృష్టించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మైథలాజికల్ సినిమాగా వస్తున్న ఈ సినిమాకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగింది. ఓవర్సీస్ లో మాత్రం ఆది పురుష్ సినిమాకి భారీ షాక్ తగిలిందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే నాని దసరా సినిమాతో పీల్చితే ఆది పురుష్ సినిమాకు తక్కువ థియేటర్లు ఉన్నాయని తక్కువ లొకేషన్ లో విడుదల అవుతుందని సమాచారం. 

అయితే ఇందుకు ముఖ్య కారణం రిలీజ్ డేట్ విషయంలో చేసిన పొరపాటు వల్లే ఇలా జరిగిందని అంటున్నారు అయితే దసరా సినిమాకి 200 లొకేషన్ లలో విడుదల చేశారు చిత్ర బృందం. కాగా ప్రభాస్ నటించిన ఈ సినిమాని 130 లొకేషన్ లలో విడుదల చేస్తున్నారని తెలుస్తుంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలైనట్లుగా తెలుస్తోంది. అయితే దీంతో పాటు మరొక కారణం కూడా ఉంది.అదేంటంటే హాలీవుడ్ మూవీ అయిన ది ఫ్లాష్ సినిమా రిలీజ్ అవుతుండడంతో ఈ సినిమాకి తక్కువ సంఖ్యలో థియేటర్లు ఇచ్చారట. ఈ క్రమంలోనే ఈ సినిమాకి సంబంధించిన చాలా గ్రాండ్గా జరిగింది.

ఫ్రీ రిలీజ్ తర్వాత ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఇక ఈ సినిమాని 600 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించగా 700 కోట్ల నుండి ఎనిమిది వందల కోట్ల వరకు బిజినెస్ జరుగుతుందని అంటున్నారు. ఈ క్రమంలోనే టీ సిరీస్ ఈ సినిమాను కొన్ని ఏరియాల్లో సొంతంగా రిలీజ్ చేయాలని భావిస్తోందట. ఇక ప్రభాస్ సినీ కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో వచ్చిన సినిమాగా ఆది పురుష్ సినిమా నిలిచింది. ఇక ఈ సినిమాతో పాటు ప్రభాస్ మరో రెండు మూడు సినిమాల్లో నటిస్తున్నాడు. ప్రాజెక్టు.కె సలార్ వంటి సినిమాలు మరొక ఏడు నెలల్లో విడుదల కానున్నాయి. ఈ సినిమాతో పాటు ఆ రెండు సినిమాలు కూడా ప్రభాస్ మార్కెట్ ని ఇంకా పెంచే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: