బాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న యువ హీరోలలో రన్బీర్ కపూర్ ఒకరు. ఈ నటుడు ఇప్పటికే ఎన్నో బాలీవుడ్ సినిమాలలో నటించి బాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ క్రేజీ హీరో గా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. కొంత కాలం క్రితం ఈ నటుడు బ్రహ్మాస్త్రం అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇకపోతే ప్రస్తుతం కూడా ఈ హీరో అనేక క్రేజీ మూవీ లలో హీరో గా నటిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ప్రభాస్ "ఆది పురుష్" అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ జూన్ 16 వ తేదీన భారీ ఎత్తున తెలుగు , తమిళ , కన్నడ , మలయాళం , హిందీ భాషలలో విడుదల కాబోతుంది.

ఇది ఇలా ఉంటే విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమాకు సంబంధించిన పది వేల టికెట్ లను బాలీవుడ్ స్టార్ హీరో రన్బీర్ కపూర్ నిరుపేద పిల్లల కోసం కొనుగోలు చేశాడు. తాను కొనుగోలు చేసిన పదివేల టికెట్ లతో నిరుపేద పిల్లలకు ఆది పురుష్ సినిమాను రన్బీర్ కపూర్ చూపించబోతున్నాడు. ఈ విషయాన్ని ఆది పురుష్ మూవీ యూనిట్ కూడా అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది.

ఇది ఇలా ఉంటే ఆది పురుష్ మూవీ లో ప్రభాస్ సరసన కృతి సనన్ హీరోయిన్ గా నటించగా ... ఓం రౌత్ ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. ప్రభాస్ హీరోగా నటించిన ఈ మూవీ పై దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే జూన్ 16 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: