తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ కలిగిన యువ హీరోల్లో నాగ శౌర్య ఒకరు. ఈయన ఇప్పటి వరకు తన కెరియర్ లో ఎన్నో సినిమాలలో హీరోగా నటించి అందులో కొన్ని మూవీ లతో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ నటుడు తన కెరియర్ లో ఊహలు గుసగుసలాడే ... ఛలో మూవీ లతో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాడు. ఊహలు గుసగుసలాడే మూవీ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందిగా ... ఛలో మూవీ కామెడీ మూవీ గా రూపొంది అద్భుతమైన విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాయి.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ యువ నటుడు రంగబలి అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి ... శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై నిర్మిస్తూ ఉండగా ... పవన్ బాసం శెట్టి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమా నుండి టీజర్ ను విడుదల చేసింది. ఈ మూవీ టీజర్ కు ప్రేక్షకుల నుండి ఏ రేంజ్ రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి. ఇది ఇలా ఉంటే తాజాగా యువ నటుడు నాగ శౌర్య "రంగబలి" మూవీ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు.

తాజాగా నాగశౌర్యసినిమా గురించి మాట్లాడుతూ ... ప్రభాస్ గారికి బుజ్జిగాడు మూవీ ఎలాగో ... నాకు రంగబలి మూవీ అలాగా ... ప్రతి నటుడుకి ఒక న్యాచురల్ బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. అది ప్రభాస్ గారికి బుజ్జిగాడు మూవీ తో బయటపడింది. నాకు రంగబలి మూవీ తో బయటపడుతుంది అంటూ నాగ శౌర్య చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: