బాహుబలి సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్గా మారిపోయిన రాజమౌళి.. త్రిబుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ డైరెక్టర్గా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.  అయితే రాజమౌళి ఏదైనా హీరోతో సినిమా అనౌన్స్ చేశాడు అంటే చాలు ఇక ఆ సినిమా స్టోరీ గురించి తెలియక ముందే అంచనాలు అంతకంతకు పెరిగిపోతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు రాజమౌళి మహేష్ బాబుతో చేయబోయే సినిమాకు సంబంధించి కూడా ఇలాగే అంచనాలు పెరిగిపోతున్నాయి. అయితే హ్యాండ్సమ్ హాంక్ గా ఉండే మహేష్ బాబుని రాజమౌళి ఎలా చూపించబోతున్నాడు అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది.


 అయితే రాజమౌళి మహేష్ బాబు తో తీయబోయే సినిమా స్టోరీ ఇదే అంటూ ఇక ప్రతిరోజు ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతున్నాయ్. అయితే రాజమౌళికి బాగా కలిసి వచ్చిన రెండు పార్ట్ ల సెంటిమెంట్ నే మహేష్ బాబు సినిమా విషయంలో కూడా రిపీట్ చేయబోతున్నాడట రాజమౌళి. ఇక ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయట. ప్రస్తుతం మహేష్ తో సినిమా కోసం ఎంచుకున్న కథలో రెండు భాగాలకు సరిపోయే స్టఫ్ ఉందని దర్శకతీరుడు రాజమౌళి నమ్ముతున్నాడట


 అయితే ఒకవేళ ఇది నిజమైతే మాత్రం కొన్నేళ్ల వరకు కూడా అటు మహేష్ బాబును వేరే సినిమాలలో చూడటం అసాధ్యం అని చెప్పాలి. ఎందుకంటే రాజమౌళి మామూలుగా ఒక్క సినిమా తీస్తేనే చాలా సమయం పడుతుంది. అలాంటిదే రెండు పార్ట్ లు అంటే ఇక మరింత ఎక్కువ సమయాన్ని కేటాయించాల్సి ఉంటుంది. బాహుబలి విషయంలో ప్రభాస్ ఇలా ఎక్కువ సమయాన్ని కేటాయించినందుకు తగ్గ ఫలితాన్ని మాత్రం అందుకున్నాడు. దుర్గా ఆర్ట్స్ పతాకం పై డాక్టర్ కే ఎల్ నారాయణ ఈ సినిమాను నిర్మించబోతున్నారట. యాక్షన్ అడ్వెంచర్గా ఈ సినిమా ఉండబోతుంది అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: