
అటు మాస్ ప్రేక్షకులకు మరియు క్లాస్ ప్రేక్షకులకు నచ్చేలా టీజర్ ఉంది. దసరా ప్రొడ్యూసర్ నిర్మిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై అంచనాలు కూడా పెరుగుతున్నాయి. కామెడీ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు కూడా నచ్చే విధంగా ఈ సినిమా ఉండనుందని సమాచారం. బాధ్యత లేకుండా తిరిగే కొడుకు కథతో ఈ సినిమా తెరకెక్కిందని సమాచారం.. గోదావరి యాస లో నాగశౌర్య మెప్పించారని తెలుస్తుంది.నాగశౌర్య ఈ సినిమా తో అయినా సక్సెస్ ట్రాక్ లోకి వస్తారో లేదో చూడాలి. నాగశౌర్య రెమ్యునరేషన్ పరిమితంగానే ఉందని అయితే తెలుస్తోంది. ఎంతో టాలెంట్ ఉన్న నాగశౌర్య సరైన ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే కెరీర్ పరంగా సక్సెస్ కావడం కష్టం కాదని కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. యంగ్ హీరో నాగశౌర్యకు సోషల్ మీడియాలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతుండటం విశేష