
ఇప్పుడు తాజాగా మార్వెల్ నుంచి వచ్చిన థోర్ , అవెంజర్స్ తదితర ఫ్రాంచైజీ లోని పాత్రలకు ప్రసిద్ధి పొందిన క్రిస్ హెమ్స్ వర్త్ కూడా rrr చిత్రం పైన స్పందించారు. ప్రస్తుతం తను నటించిన.. ఎక్స్ట్రాక్షన్ -2 సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న క్రిస్ ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేయడం జరిగింది.. తన రాబోయే చిత్రం కోసం ప్రమోషన్స్‌లో పాల్గొన్న క్రిస్ ఒక ప్రముఖ ఛానల్ కు ఇంటర్వ్యూ చేస్తూ తాను ఇటీవలే rrr చిత్రాన్ని చేశాను అది ఒక అద్భుతమైన చిత్రం వండర్ఫుల్ ఫీలింగ్ అనిపించిందని డైరెక్టర్ రాజమౌళి గారి డైరెక్షన్ బాగుందని..
ఎన్టీఆర్ ,రామ్ చరణ్ లో నటన నన్ను బాగా ఆకట్టుకుంది. వారితో కలిసి పనిచేసే అవకాశం వస్తే కలిసి పని చేస్తాను అంటూ తెలిపారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్లు ఇప్పటికీ వైరల్ గా మారుతున్నాయి అయితే హాలీవుడ్ నటీనటులు కూడా తమ సినిమాలను ఇండియాలో మరింత ప్రమోట్ చేసేందుకు RRR చిత్రాన్ని వాడేసుకుంటున్నారని ప్రేక్షకులకు కామెంట్ చేస్తున్నారు. దాదాపుగా ఆర్ఆర్ఆర్ చిత్రం రూ.1200 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను రాబట్టి హైయెస్ట్ క్రాసింగ్ చిత్రాలలో నాలుగవ స్థానంలో నిలిచింది. ప్రస్తుతం మహేష్ బాబుతో ఒక యాక్షన్ అడ్వెంచర్ చింతలన్నీ చేయబోతున్నారు రాజమౌళి.