రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా ఆది పురుష్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలో హీరో గా నటించాడు. ఈ సినిమా జూన్ 16 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయింది. ఈ మూవీ ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా మూడు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ మూడు రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

మూవీ కి మూడు రోజుల్లో నైజాం ఏరియాలో 29.77 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. సీడెడ్ ఏరియాలో 7.49 కోట్లు , యూఏ లో 8.30 కోట్లు , ఈస్ట్ లో 4.81 కోట్లు , వెస్ట్ లో 3.45 కోట్లు , గుంటూరు లో 5.83 కోట్లు , కృష్ణ లో 3.55 కోట్లు , నెల్లూరు లో 1.75 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. మొత్తంగా ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి 64.95 కోట్ల షేర్ ... 103.30 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మూవీ మూడు రోజుల్లో కర్ణాటక ఏరియాలో 10.15 కోట్ల కలక్షన్ లను వసూలు చేయగా ... తమిళ నాడు ఏరియాలో 1.95 కోట్లు , కేరళ లో 65 లక్షలు , హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 54.80 కోట్ల కలక్షన్ లను , ఓవర్ సీస్ లో 19.10 కోట్ల కలక్షన్ లను వసూలు చేసింది. మొత్తంగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మూడు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి 151.60 కోట్ల షేర్ కలక్షన్ లను ... 302.50 గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇలా ఈ మూవీ మూడు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ప్రపంచ వ్యాప్తంగా భారీ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: