ఈ సినిమా ఈ నెల 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. విడుదల సమయం దగ్గర పడుతూ ఉండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను కూడా చేయడం మొదలు పెట్టింది. ఈ సినిమా ట్రైలర్ కూడా ప్రేక్షకులలో ఆసక్తి నింపేయాల ట్రైలర్ను ఎక్కువ స్థాయిలో బస్ క్రియేట్ అయ్యేలా విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. స్పై ట్రైలర్ను అల్లు అర్జున్ మల్టీప్లెక్స్ లో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ రోజున స్పై సినిమా ట్రైలర్ను ఉదయం 11:34 గంటలకు AAA సినిమాస్లో విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం తెలియజేయడం జరిగింది.ఈ సందర్భంగా సినిమాకు సంబంధించి ఒక ప్రత్యేకమైన పోస్టర్ని కూడా విడుదల చేశారు ఇందులో నిఖిల్ తుపాకీతో టార్గెట్ సెట్ చేసుకొని ఐశ్వర్య మీనన్ చేతిలో మరొక తుపాకీ పట్టుకొని చాలా గంభీరంగా కనిపిస్తున్నారు. ఇలా సీరియస్ లుక్ లో కనిపిస్తున్న ఇద్దరు ఈ సినిమాలో బెస్ట్ కాంబినేషన్ అన్నట్లుగా అర్థమవుతోంది. ఇదివరకే స్పై సినిమాలోని లీక్స్ కూడా అంచనాలను పెంచేశాయి రానా దగ్గుబాటి కూడా ఇందులో ఒక స్పెషల్ పాత్రలో కనిపించబోతున్నారని టాక్ వినిపిస్తోంది.అంతేకాకుండా ఆర్యన్ రాజేష్ కూడా మరొక పవర్ఫుల్ పాత్రలు కనిపించబోతున్నట్లు సమాచారం. మరి మొత్తానికి నిఖిల్ ఈ సినిమాతో మరొకసారి పాన్ ఇండియా హీరోగా పేరు పొందుతారు ఏమో చూడాలి మరి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి