పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో టాలీవుడ్ ప్యాషనేట్ డైరెక్టర్ సుజిత్ ఓజీ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను ఆర్.ఆర్.ఆర్ నిర్మించిన డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. పవన్ ఓజీ ఒక స్టైలిష్ ఎంటర్టైనర్ గా వస్తుందని తెలుస్తుంది. హరి హర వీరమల్లుతో పవన్ మొదటి పాన్ ఇండియా అటెంప్ట్ చేయాలని అనుకున్నా ఆ సినిమా ఇప్పుడప్పుడే పూర్తి అయ్యే అవకాశం లేదని అర్ధమవుతుంది. అందుకే పవన్ ఓజీ మీద పూర్తి ఫోకస్ పెట్టాడు. ఈ సినిమాను పవన్ తన మొదటి పాన్ ఇండియా సినిమాగా చేయాలని ఫిక్స్ అయ్యారు. అలానే తన ప్లానింగ్ లో ఉన్నారు.

సుజిత్ సాహో తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నా మళ్లీ పర్ఫెక్ట్ స్కెచ్ తోనే పవన్ సినిమా మొదలు పెట్టాడు. పవన్ ఓజీలో చాలా సర్ ప్రైజ్ లు ప్లాన్ చేస్తున్నాడట సుజిత్. ఈ సినిమా కాస్టింగ్ విషయంలో కూడా ఎక్కడ తగ్గట్లేదు సుజిత్. లేటెస్ట్ గా బాలీవుడ్ కిస్సింగ్ స్టార్ ఇమ్రాన్ హష్మిని కూడా ఈ సినిమాలోకి తీసుకున్నాడు. అంతేకాదు పవన్ తండ్రిగా అమితాబ్ నటిస్తాడని లేటెస్ట్ టాక్. ఎలా చూసినా సరే పవన్ ఓజీ సంథింగ్ స్పెషల్ గా ఉండబోతుందని తెలుస్తుంది.

పవన్ ఓజీ సినిమా విషయంలో సుజిత్ ప్లానింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. సినిమాతో సుజిత్ మరోసారి తన డైరెక్షన్ టాలెంట్ చూపించాలని ఫిక్స్ అయ్యాడు. పవన్ ఓజీ ఒక గ్యాంగ్ స్టర్ కథతో వస్తుందని తెలుస్తుంది. సినిమాలో చెన్నై భామ ప్రియాంక అరుల్ మోహనన్ హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాలో పవన్ లుక్స్, యాక్షన్ సీన్స్ మాత్రం ఫ్యాన్స్ ని పిచ్చెక్కించేలా చేస్తాయని అంటున్నారు. మరి పవన్ ఓజీ అనుకున్న టార్గెట్ రీచ్ అవుతుందా లేదా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: