
మురళీ శర్మ ,జాన్ విజయం, రాధికా శరత్ కుమార్, కిషోర్ కుమార్ తదితరులు కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా ట్రైలర్ ని ఇటీవలే విడుదల చేయగా అభిమానులను ఆకట్టుకుంది. దీంతో ఈ సినిమా విడుదల తేదీని సైతం ప్రకటించింది. తాజాగా ఒక కొత్త పోస్టర్ను విడుదల చేస్తూ జూలై 21వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోందంటూ ఒక పోస్టర్తో విజయ్ కంప్లీట్ మెన్ ఓవర్గా చూపించడం జరిగింది. విజయ్ ఆంటోని ఈ లుక్ లో చూడడానికి చాలా కొత్తగా కనిపిస్తున్నారు. ఈ చిత్రాన్ని కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరి క్రైమ్ థ్రిల్లర్ సినిమాతో రాబోతున్న ఈ చిత్రంతో విజయ్ ఆంటోని మరొకసారి తన పంద చూపిస్తారేమో చూడాలి మరి.
బిచ్చగాడు -2 సినిమా వల్ల మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని కలెక్షన్ల పరంగా కూడా బాగానే రాబట్టినట్లు తెలుస్తోంది. బిచ్చగాడు-2 సినిమా షూటింగ్ సమయంలో ప్రమాదం జరిగిన కూడా వాటన్నిటిని లెక్కచేయకుండా కొద్దిరోజులు రెస్టు తీసుకొని మరి సినిమా షూటింగ్ పూర్తి చేశారు. హత్య సినిమా విడుదలైన తర్వాత కొద్ది రోజులకే పవన్ కళ్యాణ్ నటించిన బ్రో సినిమా జులై 27న విడుదల కాబోతోంది.. మరి పవన్ కళ్యాణ్ సినిమా ముందు విజయ్ ఆంటోనీ సినిమా ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.