వాస్తవానికి ఈమూవీ కథ ఒక యదార్థ సంఘటన ఆధారంగా ఈమూవీ రచయిత వ్రాసినట్లు స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఈ సంఘటన తమిళనాడులో జరిగిందని ఈమూవీ రచయిత చెపుతున్నాడు. తమిళనాడు రాష్ట్రంలోని సేలం ప్రాంతంలో ఒక అమ్మాయిని ఇద్దరు అబ్బాయిలు కలిసి కిరాతకంగా హత్య చేశారు. వాస్తవానికి ఆఇద్దరు ఆ అమ్మాయిని ప్రేమించిన వాళ్ళు. అక్కడ ఇంజినీరింగ్ చదివే ఒక అమ్మాయి తన క్లాస్ మేట్‌తోనే కాక ఒక ఆటోడ్రైవర్‌తో ఒకేసారి స్నేహం చేసింది ప్రేమలోనూ పడింది.
ఒకరికి తెలియకుండా మరొకరితో కొన్ని రోజులు కలిసి ప్రయాణం చేయడమే కాకుండా వారితో సహజీవనం చేసింది. అయితే ఆవిషయం ఆ అబ్బాయిలు ఇద్దరికీ తెలియడంతో వారు రగిలిపోయి ఆ అమ్మాయిని కిరాతకంగా హత్య చేశారు. కొన్ని సంవత్సరాల క్రితం తమిళనాడులో సంచలనం సృష్టించిన ఈ సంఘటనను ఆధారంగా చేసుకుని హత్య సంఘటన లేకుండా మిగతా అన్ని విషయాలు యధాతధంగా ‘బేబి’ కథలో వ్రాసాను అని ఈమూవీ రచయిత సాయి రాజేష్ చెపుతున్నాడు.
‘బేబి’ సినిమాలో హీరోయిన్ పాత్రలో ఆ అమ్మాయి అలా ప్రవర్తించడానికి గల కారణం ఏమి అయిఉంటుంది అన్న ఆలోచనతో ‘బేబి’ కథను అల్లినట్లు సాయి రాజేష్ చెపుతున్నాడు. ఈమూవీలో క్లైమాక్స్ కథను మార్చి తాను వేరుగా వ్రాశానని ఈకథ అందరికీ నచ్చడం తనకు చాల ఆనందంగా ఉంది అని సాయి రాజేష్ అంటున్నాడు. ఒక ఊహించని ఘనవిజయం సాధించిన ‘బేబి’ ఈ సంవత్సరం టాప్ ట్రెండింగ్ మూవీలలో ఒకటిగా మారే ఆస్కారం ఉంది..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి