సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా నటించిన జైలర్ మూవీ రేపు అనగా ఆగస్టు 10 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల కానుంది. ఇకపోతే ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మరి ఈ మూవీ కి ఏ ఏరియాలో ఏ రేంజ్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది అనే వివరాలను తెలుసుకుందాం.

మూవీ కి తమిళ నాడు ఏరియాలో 62 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 12 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

ఈ సినిమాకు కర్ణాటక ఏరియాలో 10 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

మూవీ కి కేరళ ఏరియాలో 5.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

ఈ సినిమాకు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 3 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

ఇక ఈ సినిమాకి ఓవర్ సీస్ లో 30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

మొత్తంగా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 122.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 124 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసినట్లు అయితే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ఫార్మలాను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ ను అందుకుంటుంది. అలాగే ఈ మూవీ కనక ప్రపంచ వ్యాప్తంగా 240 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసినట్లు అయితే హిట్ స్టేటస్ ను అందుకుంటుంది.

ఇకపోతే ఈ మూవీ లో తమన్నా హీరోయిన్ గా నటించగా ... రమ్యకృష్ణ ఓ కీలకమైన పాత్రలో నటించింది. నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. సన్ పిక్చర్స్ బ్యానర్ వారు ఈ మూవీ ని నిర్మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: