ఈ మూవీ ప్రమోషన్ కు సంబంధించిన అన్ని కార్యక్రమాలు అలాగే ఇంటర్వ్యూలలో తాను విజయ్ దేవరకొండ తో కలిసి ఖచ్చితంగా పాల్గొంటాను అంటూ ఆమె నిర్మాతలకు తన అభిప్రాయాన్ని తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో సమంత తన అనారోగ్య సమస్యల కోసం అమెరికా నుండి త్వరగా వచ్చే స్తోందా లేదంటే ఆమె అసలు అమెరికాకు వెళ్లలేదా అన్న సందేహాలు ఆమె అభిమానులకు వస్తున్నాయి.
వాస్తవానికి సమంత ఈమధ్య కాలంలో దర్శకులు చెపుతున్న కథలను వినడానికి ఆశక్తికనపరచడం లేదు అంటూ లీకులు వచ్చాయి. దీనితో సమంత బ్రేక్ తీసుకోవడం ఖాయం అని అంతా అనుకున్నారట. ఇప్పుడు ‘ఖుషీ’ ప్రమోషన్ కు సమంత వస్తున్న పరిస్థితులలో సినిమాలలో నటించే విషయంలో ఆమె తన మనస్సు మార్చుకుందా అన్న సందేహాలు రావడం సహజం.
ఇప్పటివరకు విడుదలైన ‘ఖుషీ’ మూవీకి సంబంధించిన పాటలు యూత్ కు బాగా కనెక్ట్ కావడంతో పాటు ఈపాటలలో సమంత చాల అందంగా కనిపించడంతో ఆమె సెకండ్ ఇన్నింగ్స్ ప్రేరంభానికి ‘ఖుషీ’ అన్ని విధాల సహకరిస్తుంది అన్న అంచనాలు వస్తున్నాయి. ఈ సినిమా విజయం కేవలం విజయ్ సమంతకు మాత్రమే కాకుండా విజయ్ దేవరకొండకు కూడ చాల అవసరం. వరస ఫ్లాప్ లతో సతమైపోతున్న ఈ హీరోకి ‘ఖుషీ’ విజయం కీలకంగా మారింది. దీనితో ‘ఖుషీ’ ఫలితాం పై అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలలో కూడ ఆశక్తి బాగా కనిపిస్తోంది..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి