ఇలా ఒకవైపు బుల్లితెరపై కమేడియన్ గా.. మరోవైపు వెండితెరపై నటుడిగా.. ఇంకోవైపు సినిమాలకు డైలాగ్స్ అందిస్తూ రచయితగా ఫుల్ బిజీగా ఉన్నాడు అని చెప్పాలి. అయితే ఇటీవల జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది పెళ్లి విషయం కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. గత కొన్ని రోజులుగా హైపర్ ఆది ఒక యాంకర్ తో ప్రేమాయణం నడుపుతున్నాడంటూ వార్తలు వచ్చాయి. అయితే ఆ యాంకర్ వర్షిని అంటూ ప్రచారం జరిగింది. ఈ విషయంపై స్పందించిన వర్షిని అందులో నిజం లేదు అంటూ తేల్చి చెప్పింది. దీంతో ఇక హైపర్ ఆది ప్రేమ విషయంలో వచ్చిన రూమర్స్ కి చెక్ పడింది అని చెప్పాలి. అయితే ఇటీవల ఒక షోలో ఏకంగా ఆది తన ప్రేయసిని అందరికీ పరిచయం చేశాడు.
తన ప్రేయసి పేరు విహారిక అంటూ హైపర్ ఆది తెలిపాడు. ఈటీవీలో ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ అనే కామెడీ షోలో ఇలా తన ప్రేయసిని పరిచయం చేసి అందరినీ సర్ప్రైజ్ చేశాడు హైపర్ ఆది. అయితే ఇలా శ్రీదేవి డ్రామా కంపెనీలో అడుగుపెట్టిన విహారిక నిజంగానే హైపర్ ఆది లవర్ అని అందరూ నమ్ముతుంటే.. ఇది కూడా టిఆర్పి స్టంట్ అయి ఉంటుంది అని మరి కొంతమంది విమర్శలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈటీవీలో ప్రసారమయ్యే పలు కార్యక్రమాలలో టిఆర్పి కోసం ఇప్పటివరకు ఎంతోమంది అమ్మాయిలను తీసుకువచ్చి గర్ల్ ఫ్రెండ్ అంటూ పరిచయం చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి అని చెప్పాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి