వీరి పెళ్లి ఇటలీలో జరగబోతుందని ఇప్పటికే పెళ్లి పనులు ప్రారంభమయ్యాయని వీరి వివాహం ఆగస్టు చివరి వారంలో జరగబోతుంది అంటూ ఎన్నో రకాల వార్తలు వచ్చాయి. అయితే తాజాగా వరుణ్ తేజ్ గాండీవ దారి అర్జున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ ప్రమోషన్లలో భాగంగా ఈయన తన పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చారు.ఈ సందర్భంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ… తన పెళ్లి తేదీ ఇంకా ఫిక్స్ కాలేదని తెలిపారు.
తన పెళ్లి నవంబర్ లేదా డిసెంబర్ నెలలో ఉండవచ్చని వరుణ్ తేజ్ వెల్లడించారు. అయితే తమ పెళ్లి తేదీ ఎప్పుడు అనేది తన తల్లి చేతిలోనే ఉందని ఆమె తన పెళ్లి తేదీని ఖరారు చేయబోతుంది అంటూ వరుణ్ తేజ్ వెల్లడించారు. తనకు హైదరాబాద్లోనే పెళ్లి చేసుకోవాలని ఉంది అయితే తన పెళ్లి గ్రాండ్ గా కాకుండా ప్రైవేట్ గానే చేసుకోవాలని అనుకుంటున్నాను. అలా చేయడానికి హైదరాబాదులో వీలు కాదు కనుక తాను డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నానని తెలిపారు.ఇప్పటికే ఇండియాలో మూడు ప్లేసులను సెలెక్ట్ చేసామని అలాగే ఫారెన్ లో కూడా రెండు ప్లేసులను సెలెక్ట్ చేశామని ఈయన తెలిపారు.అయితే ముందుగా పెళ్లి తేది ఫిక్స్ అయిన తర్వాతనే పెళ్లి వేదిక ఎక్కడ అనే విషయాలను కూడా నిర్ణయించబోతున్నాము అంటూ ఈ సందర్భంగా వరుణ్ తేజ్ తన పెళ్లి గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి