తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న మోస్ట్ బ్యూటిఫుల్ నటి మనులలో సోనాల్ చౌహాన్ ఒకరు. ఈ ముద్దు గుమ్మ తెలుగు లో ఇప్పటి వరకు అనేక సినిమా లలో నటించినప్పటికీ ఎక్కువ శాతం నందమూరి నటవ్సింహం బాలకృష్ణ హీరోవ్గా రూపొందిన సినిమా లలో నటించి మంచి క్రేజ్ ను టాలీవుడ్ ఇండస్ట్రీ లో సంపాదించుకుంది. ఇకపోతే పోయిన సంవత్సరం విడుదల అయినటువంటి ది ఘోస్ట్ అనే సినిమాలో ఈ ముద్దు గుమ్మ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ లో నాగార్జున హీరోగా నటించగా ... ప్రవీణ్ సత్తార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.

మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయింది. ఇకపోతే ఈ మోస్ట్ బ్యూటిఫుల్ నటి కొంత కాలం క్రితం విక్టరీ వెంకటేష్ , మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా మిల్కీ బ్యూటీ తమన్నా , మెహరీన్ హీరోయిన్ లుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందినటువంటి ఎఫ్ 3 సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించింది. ఈ మూవీ లోని ఈ ముద్దు గుమ్మ నటనకు ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు లభించాయి.

ఇకపోతే ఇప్పటి వరకు భారీ క్రేజ్ ఉన్న సినిమాలు కాకుండా మామూలు క్రేజ్ ఉన్న సినిమాలను నటిస్తూ కెరియర్ ను ముందుకు సాగిస్తున్న ఈ నటికి ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందబోయే సినిమాలో ఓ కీలక పాత్రలో ఆఫర్ వచ్చినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ వార్త కనుక నిజం అయినట్లు అయితే ఈ ముద్దు గుమ్మ స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి అంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇకపోతే ఇప్పటి వరకు ఈ వార్తకు సంబంధించిన ఇలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: