కేరళలో జరిగిన ప్రకృతి విపత్తును ఆధారంగా చేసుకుని 2018 అనే మూవీ ని దర్శకుడు జుడే ఆంథానీ జోసెఫ్ రూపొందించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో టోవినో తామస్ కీలకమైన పాత్రలో నటించాడు. ఇకపోతే ఈ సినిమా మొదట మలయాళం లో విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా భారీ కలెక్షన్ లను కూడా వసూలు చేసింది. ఇలా ఈ సినిమా మలయాళ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అదిరిపోయే రేంజ్ లో అలరిస్తూ ఉండడంతో ఈ సినిమాను ఆ తర్వాత కొన్ని రోజులకు తెలుగు లో విడుదల చేశారు. ఇకపోతే అప్పటికే మలయాళ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బాస్టర్ విజయం సాధించిన సినిమా కావడంతో తెలుగు సినీ ప్రేమికులు కూడా ఈ మూవీ పై మంచి అంచనాలు పెట్టుకున్నారు.

అలా మంచి అంచనాల నడుమ తెలుగు లో విడుదల అయిన ఈ సినిమా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా అద్భుతమైన విజయాన్ని అందుకొని భారీ కలెక్షన్ లను కూడా వసూలు చేసింది. ఇకపోతే ఇప్పటికే బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ ను అందుకున్న ఈ సినిమా కొన్ని రోజుల క్రితం నుండే "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇకపోతే ఈ సినిమాకి "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో కూడా ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది.

ఇక ఇప్పటికే థియేటర్ మరియు "ఓ టి టి" ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ యొక్క శాటిలైట్ హక్కులను స్టార్ మా సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ మూవీ యొక్క తెలుగు వర్షన్ ను ఈ ఆదివారం రోజు సాయంత్రం 6 గంటలకు స్టార్ మా చానల్లో ప్రసారం చేయనున్నట్లు ఈ సంస్థ అధికారికంగా ప్రకటించింది. మరి ఈ మూవీ బుల్లి తెర ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: