నైజాం ఏరియాలో ఏ ఏరియాలో రాని రేంజ్ కలెక్షన్ లు హైదరాబాదు లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ లో వస్తూ ఉంటాయి. దానితో నైజాం ఏరియాలో ఏదైనా సినిమా విడుదల అయ్యింది అంటే ఆ సినిమాలకు ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఎలాంటి కలెక్షన్ లు వసూలు అవుతున్నాయి అని సినీ బృందాలు కూడా ప్రత్యేక ఆసక్తిని చూపిస్తూ ఉంటాయి. అంతటి క్రేజ్ ఉన్న ఈ ఏరియాలో ఇప్పటి వరకు మీడియం రేంజ్ హీరోలు నటించిన సినిమాలలో హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 8 మూవీస్ ఏవో తెలుసుకుందాం.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఫిదా సినిమా ఆర్టీసీ క్రాస్ రోడ్ లో 1.46 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

నితిన్ హీరోగా సదా హీరోయిన్ గా తేజ దర్శకత్వంలో రూపొందిన జయం సినిమా 1.08 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

విజయ్ దేవరకొండ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన గీత గోవిందం సినిమా 1.1 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

సాయి ధరమ్ తేజ్ హీరోగా రూపొందిన "బ్రో" సినిమా 96.28 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది.

రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈస్మార్ట్ శంకర్ మూవీ 91.68 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది.

నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన దసరా సినిమా 91.52 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది.

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన హ్యాపీ డేస్ సినిమా 80.68 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది.

అక్కినేని నాగేశ్వరరావు , నాగార్జున , నాగ చైతన్య ప్రధాన పాత్రలో రూపొందిన మనం సినిమా 75.5 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: