తెలుగులోనే కాకుండా తమిళ సినీ ఇండస్ట్రీలో కూడా స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న త్రిష గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇటీవికాలంలో మణిరత్నం ఇతిహాసం 2 లో కుందవై పాత్రలో నటించి భారీ విజయాన్ని తన సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే త్రిష పెళ్లికి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అయితే మలయాళ నిర్మాతతో త్వరలోనే వివాహం చేసుకోబోతుంది అన్న సమాచారం వినబడుతోంది. అంతేాదండోయ్ అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నప్పటికీ అందులో క్లారిటీ లేదు. అయితే గతంలో త్రిషకి నిర్మాతగా మారిన పారిశ్రామికవేత్త వరుణ్ మనియన్ తో నిశ్చితార్థం జరిగింది.

 ఇక దాని తర్వాత వీరిద్దరి మధ్య ఏం జరిగిందో కానీ ఆ పెళ్లి మధ్యలోనే ఆగిపోయింది. అయితే ఆ సమయంలో త్రిష కృష్ణన్ తెలుగు నటుడు రానా దగ్గుబాటితో సంబంధంలో ఉన్నట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో త్రిష పెళ్లి గురించి సీరియస్ గా పరిగణించలేదు అని పేర్కొంది. ఒత్తిడి కారణంగానే వివాహం చేసుకోలేదు అని పెళ్లి తరువాత చాలామంది విడాకులు తీసుకుంటున్నారు అని సన్నిహితుల దగ్గర చెప్పినట్లుగా వార్తలు వినిపించాయి. అంతే కాదు తాను సరైన వ్యక్తిని కలుసుకోలేదు అని త్రిష ఈ సందర్భంగా వెల్లడించింది.

అనంతరం పొన్నియన్ సెల్వన్ టు విజయం తరువాత త్రిష అనేక సినిమాలతో బిజీగా అయ్యింది. ఈ సినిమా తరువాత తనకి వరుస సినిమాలో అవకాశాలు రావడంతో ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. త్వరలోనే లోకేష్ కనగరాజ దర్శకత్వం లో వస్తున్న తమిళ్ యాక్షన్ త్రిల్లర్ లియో సినిమాలో కనిపించబోతోంది. వీటితోపాటు పలు సినిమాలు చేయడానికి కూడా త్రిష గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలా ప్రస్తుతం త్రిష మలయాళ నిర్మాతతో త్వరలోనే పెళ్లి పీటలు ఏక్కబోతుంది అని తెలుస్తోంది. దీంతో త్రిష పెళ్లికి సంబంధించిన ఈ వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: