
ఈ దంపతులిద్దరికీ ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు, ఇంతటి సుదీర్ఘ దాంపత్య జీవితం గడిపిన తర్వాత వీళ్ళ మధ్య ఏర్పడిన కొన్ని విభేదాల కారణంగా రీసెంట్ గానే విడిపోవాల్సి వచ్చింది. ఎందుకు విడిపోయారు ఏమిటి అనేది కాసేపు పక్కన పెడితే, రజినీకాంత్ కూతురు ఐశ్వర్య గురించి ఎవరికీ తెలియని ఒక ఆసక్తికరమైన విషయం ఒకటి బయటపడింది. చాలా ఏళ్ళ తర్వాత బయటపడిన ఈ నిజం ఇప్పుడు సోషల్ మీడియా ని ఒక రేంజ్ లో ఒప్పేస్తుంది. అదేంటో ఒకసారి చూద్దాం. అదేమిటంటే అప్పట్లో ఐశ్వర్య ప్రముఖ కోలీవుడ్ యంగ్ హీరో శింబు తో ప్రేమాయణం నడిపింది అట. వీళ్లిద్దరి మధ్య విబేధాలు రావడం, ఆ తర్వాత వీళ్ళ లవ్ బ్రేకప్ అవ్వడం తో అతని మీద కోపంతోనే ధనుష్ ని ఈమె పెళ్లాడినట్టు తెలుస్తుంది.ధనుష్ కి శింబు కి కోలీవుడ్ లో మొదటి నుండి పడదు. ఎదో ఒక విషయం ఇద్దరు గొడవలు పడుతూనే ఉంటారు. ఆ గొడవలకు మూల కారణం ఇదేనని సమాచారం. అయితే ఐశ్వర్య తో విడాకులు తీసుకున్న తర్వాత ధనుష్ ఒక ప్రముఖ కోలీవుడ్ హీరోయిన్ తో డేటింగ్ చేస్తున్నాడని, ప్రస్తుతం ఆమె ధనుష్ ఇంట్లోనే ఉంటుంది అని అంటున్నారు, ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో చూడాలి.