టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాన్ ఇండియా సినిమా మిస్ చేసుకున్నాడు అన్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. అయితే దానికి కారణం రాజమౌళి అని అంటున్నారు.. ఇక ఈ వార్తల్లో నిజమవుతుంది అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.. ప్రస్తుతం ప్రభాస్ నటించిన సలార్ సినిమా కోసం దేశవ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ అందరూ ఎదురు చూస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ శృతిహాసన్ జంటగా వస్తున్న సెప్టెంబర్ 28న భారీ అంచనాల మధ్య విడుదల కావాలి. కానీ అనూహ్యంగా ఈ సినిమా విడుదల వాయిదా పడింది.

అయితే ఇప్పటికే ప్రభాస్ హీరోగా నటించిన పాన్ ఇండియా సినిమాలన్నీ కూడా వరుసగా డిజాస్టర్లుగా మారాయి. దాంతో ప్రభాస్ అభిమానులు అందరూ  సలార్ సినిమా పైనే అంచనాలను పెట్టుకున్నారు. అయితే ఇప్పటికే ప్రభాస్ నటించిన సినిమాలన్నీ కూడా డిజాస్టర్లుగా మారడంతో సలార్ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది అని ప్రభాస్ అభిమానులు ఎంతో నమ్మకంతో ఉన్నారు. దానితోపాటు ప్రీమియర్ షో నుండి 3 మిలియన్ డాలర్ల వరకు ఈ సినిమా వసూలు చేస్తుంది అని ఇప్పటికీ ట్రేడ్ విశ్లేషకులు అంచనాలను కూడా వేస్తున్నారు. ఈ క్రమంలోనే సలాడ్ సినిమా గురించి సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ అవుతుంది.

అది ఏంటంటే ఈ సినిమాలో మొదటి ఛాయిస్ ప్రభాస్ కాదు అని అంటున్నారు. అవును ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాని షేక్ చేస్తోంది.nప్రభాస్ కంటే ముందే ఈ సినిమా కోసం రామ్ చరణ్ ని హీరోగా అనుకున్నారట. ప్రశాంత్ రామ్ చరణ్ దగ్గరికి వెళ్లి సలార్ స్టోరీ చెప్పారట. స్టోరీ విన్న రామ్ చరణ్ స్టోరీ బాగుంది కానీ ప్రస్తుతం నేను రాజమౌళి సినిమా చేస్తున్నాను.. ఈ సినిమా ఎప్పుడు పూర్తవుతుందో ఇంకా తెలియదు అని. ఈ సినిమాని చాలా సున్నితంగా రిజెక్ట్ చేశాడట. ఇక ప్రశాంత్ కి రాజమౌళి దర్శకత్వంలో సినిమా అంటే ఎన్ని రోజులు టైం పడుతుందో క్లారిటీ లేదు. కాబట్టి ప్రభాస్ దగ్గరికి వెళ్లి ఈ సినిమా స్టోరీ చెప్పాడట. స్టోరీ నచ్చిన ప్రభాస్సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇప్పుడు ఈ సినిమా పూర్తయింది. ఇక ఈ విషయం తెలిసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు అనవసరంగా ఈ సినిమాని రిజెక్ట్ చేశారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.!!

మరింత సమాచారం తెలుసుకోండి: