ప్రస్తుతం ఉన్న కుర్ర హీరోయిన్స్ లో క్రేజ్ కి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరు అని అడిగితే అందరూ చెప్పే పేరు సాయి పల్లవి. ఈటీవీ లో ప్రసారమయ్యే 'ఢీ' అనే డ్యాన్స్ షో ద్వారా పాపులారిటీ ని దక్కించుకున్న సాయి పల్లవి కి మలయాళం లో 'ప్రేమమ్' చిత్రం లో మెయిన్ హీరోయిన్ గా నటించే ఛాన్స్ దక్కింది.ఆ సినిమా అక్కడ పెద్ద హిట్ అవ్వడం తో సౌత్ లో ఈమె డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. ముందుగా శేఖర్ కమ్ముల దర్శకత్వం లో 'ఫిదా' సినిమాలో నటించే అవకాశం దక్కింది. ఈ చిత్రం కమర్షియల్ గా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ చిత్రం ఆ రేంజ్ లో హిట్ అవ్వడానికి కారణం సాయి పల్లవి అంటూ అప్పట్లో ప్రతీ ఒక్కరు కామెంట్ చేసేవారు.ఈ సినిమా తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోనవసరం రాలేదు.మంచి డిమాండ్ ఉంది కదా అని ఏ సినిమా పడితే ఆ సినిమాకి ఒప్పుకోకుండా, కేవలం నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలను మాత్రమే పోషిస్తూ ఈమె ఇంత దూరం వచ్చింది. అందుకే సాయి పల్లవి ఒక సినిమాలో ఉంది అంటే, కచ్చితంగా ఆ సినిమాకి ఒక బ్రాండ్ వేల్యూ వస్తుంది. అందుకే ఈమెని లేడీ పవర్ స్టార్ అని పిలుస్తూ ఉంటారు.

అయితే ఈమధ్య కాలం లో ఈమెకి సరైన సక్సెస్ రాలేదు. చేసిన ప్రతీ సినిమా కమర్షియల్ గా డిజాస్టర్ ఫ్లాప్ అయ్యాయి. అందుకే కాస్త గ్యాప్ ఇచ్చి మంచి స్క్రిప్ట్ తో మన ముందుకు రాబోతుంది. అక్కినేని నాగ చైతన్య మరియు చందు మొండేటి కాంబినేషన్ లో గీత ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కబోతున్న సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించబోతుంది.రీసెంట్ గానే ఆమె స్టోరీ డిస్కషన్స్ లో కూడా జాయిన్ అయ్యారు.భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నటించేందుకు సాయి పల్లవి దాదాపుగా 5 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని తీసుకుంటుంది అట. ఇదే ఆమె కెరీర్ లో హైయెస్ట్ రెమ్యూనరేషన్ అని అంటున్నారు. మార్కెట్ లో తనకి ఉన్న క్రేజ్ కి తగ్గటుగగానే రెమ్యూనరేషన్ ని డిమాండ్ చేసినట్టు చెప్తున్నారు. మరో విశేషం ఏమిటంటే ఈ సినిమాకి నాగ చైతన్య తీసుకుంటున్న రెమ్యూనరేషన్ కేవలం 7 కోట్ల రూపాయిలు మాత్రమే, అంటే కేవలం రెండు కోట్ల రూపాయిలు తేడా అన్నమాట. ఇకపోతే గతం లో నాగ చైతన్య మరియు సాయి పల్లవి కలిసి 'లవ్ స్టోరీ' అనే చిత్రం చేసారు. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యింది, మరి అదే రేంజ్ మ్యాజిక్ ని ఈ చిత్రం రిపీట్ చేస్తుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: