జనసేన అధినేత, ప్రముఖ సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సీఎం కావాలనేది ఆయన అభిమానుల ఆకాంక్ష కాగా 2024 ఎన్నికల తర్వాత ఆ కల నెరవేరే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.పవన్ కళ్యాణ్ కెరీర్ లోని బెస్ట్ సినిమాలలో ఒకటైన బంగారం సినిమాలో మీరాచోప్రా కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తో మీరాచోప్రాకు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు వచ్చింది. పవన్ సినిమాలో నటించడం వల్లే ఈ స్థాయిలో గుర్తింపు రావడం తో మీరాచోప్రా పవన్ కళ్యాణ్ ను ఎంతగానో అభిమానిస్తారు.తాజా గా మీరాచోప్రా ఒక సందర్బంలో పవన్ కళ్యాణ్ మనస్సు బంగారమని పవన్ ను ఏపీ సీఎంగా చూడాలని ఉందని చెప్పుకొచ్చారు. కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ తాజా గా మహిళా రిజర్వేషన్ బిల్లు దిశగా అడుగులు వేసిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ గతంలోనే మహిళల రిజర్వేషన్ బిల్లు గురించి మాట్లాడటం తో పాటు జనసేన ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టారు.

 ఈ వీడియో గురించి మీరా చోప్రా రియాక్ట్ అవుతూ పవన్ మనస్సు బంగారం అని పవన్ ను సీఎంగా చూడాలని ఉందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. మీరాచోప్రా కామెంట్లను నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ చేస్తున్నారు. మీరాచోప్రా తెలుగులోకి రీఎంట్రీ ఇవ్వడంతో పాటు వరుస ఆఫర్లతో బిజీ కావాలని నెటిజన్లు కోరుకుంటున్నారు. మీరాచోప్రా రెమ్యునరేషన్ పరిమితంగా ఉండటంతో ఆమె రీఎంట్రీలో కూడా సంచలనాలు సృష్టించే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.మీరాచోప్రా  కెరీర్ పరంగా మరింత బిజీ కావాలని అభిమానులు ఫీలవుతున్నారు. మీరాచోప్రాను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. మీరా చోప్రా కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో చూడాల్సి ఉంది. మీరాచోప్రాకు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఊహించని స్థాయిలో పెరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: