
ఈ క్రమంలో లేటెస్ట్ గా నవీన్ కి కొత్త ఆఫర్స్ వస్తున్నట్టు తెలుస్తుంది. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి హిట్ ని పురస్కరించుకుని మైత్రి నిర్మాతలు నవీన్ ని కలిసి కంగ్రాట్స్ చెప్పారు. ఈ క్రమంలో అతనితో మైత్రి సినిమా కూడా చేసేందుకు అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మంచి కథ మంచి దర్శకుడు దొరికితే ఈ కాంబో సినిమా ఫిక్స్ అయినట్టే లెక్క. నవీన్ కూడా సినిమా సినిమాకు డిఫరెంట్ అటెంప్ట్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు.
మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి విషయంలో నవీన్ తన భుజాన వేసుకుని సినిమా నడిపించాడు. సినిమా ప్రమోషన్స్ లో కూడా అతనే మొత్తం చూసుకున్నాడు. అంత కష్టపడ్డాడు కాబట్టే నవీన్ కి హిట్ దక్కింది. నవీన్ పొలిశెట్టి మల్టీ టాలెంటెడ్ కాబట్టి కచ్చితంగా అతనికి ఫ్యూచర్ లో మంచి అవకాశాలు వస్తాయని చెప్పొచ్చు. నవీన్ తన ఎంటర్టైనింగ్ సినిమాలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ సక్సెస్ ఫుల్ కెరీర్ కొనసాగిస్తున్నాడు. యువి క్రియేషన్స్ తో మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా చేసిన నవీన్ ప్రస్తుతం అనగరనగా ఒకరాజు సినిమా సితార బ్యానర్ లో చేస్తున్నాడు. ఇప్పుడు లైన్ లోకి movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ కూడా వచ్చింది.