స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కామెడీ సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యతని ఇస్తే నందమూరి నటసింహం బాలకృష్ణ యాక్షన్ సినిమాలకి ఎక్కువగా ప్రాధాన్యతని ఇస్తూ ఉంటారు. అయితే ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుంది అని అంటే ఈ సినిమాపై అంచనాలను వేరే లెవెల్ లో క్రియేట్ చేస్తారు. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమాలో బాలయ్య మార్క్ ఉంటుందా లేదా అనిల్ రావిపూడి మార్క్ ఉంటుందా అన్న అనుమానాలు ప్రతిసారి వస్తాయి. అయితే భగవంత్ కేసరి సినిమా టీజర్ ద్వారా అనిల్ రావిపూడి మాస్ ఆడియన్స్ తో పాటు క్లాస్ ఆడియన్స్ కు సైతం

 నచ్చేలాగా ఈ సినిమా రాబోతుంది అని క్లారిటీ ఇచ్చాడు. అయితే ఈ సినిమాలో కడుపుబ్బ నవ్వించే సన్నివేశాలు చాలానే ఉంటాయని తెలుస్తోంది. అనిల్ రావపూడి  సినిమాను ఇష్టపడే ప్రేక్షకులను నిరాశపరచకుండా  ఈ సినిమా ఉండబోతుంది అని తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో నందమూరి నటసింహం బాలకృష్ణ శ్రీ లీల బాబాయ్ కూతురు పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. బాలయ్య తల్లి పాత్రలో జయచిత్రా కనిపించబోతున్నట్లుగా సమాచారం. షైన్ స్క్రీన్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇక అనిల్ రావిపూడి ఫేవరెట్ హీరో నందమూరి నటసింహం బాలకృష్ణ  కాగా

 ఈ సినిమాతో నందమూరి నటసింహం బాలకృష్ణ భారీ విజయాన్ని అందుకోవాలి అని అందరూ కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే నందమూరి నటసింహం బాలకృష్ణ ఇప్పుడు భగవంత్ కేసరి సినిమా ప్రమోషన్స్ ను సైతం సరికొత్తగా ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం. బాలయ్య పొలిటికల్ కార్యక్రమాల వల్ల కొంత ఆలస్యంగా ఈ సినిమా ప్రమోషన్స్లో పాల్గొనే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా భారీ రేంజ్ లో ఉండబోతోంది అని ఇప్పటికే రకరకాల వార్తలు వెలబడుతున్నాయి. అంతేకాదు సరికొత్త రికార్డును సైతం క్రియేట్ చేయడం ఖాయమన్న కామెంట్లు సైతం వినపడుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: