బోయపాటి శ్రీనివాస్ అంటేనే ఫుల్ ఊర మాస్.. ఈయన సినిమాల్లో మాస్ యాక్షన్ తో పాటు ఆకట్టుకునే ఎమోషన్స్ కూడా ఉంటాయి. ఎన్నో బ్లాక్ బస్టర్స్ తెరకెక్కించిన బోయపాటి గత సినిమా అఖండ తో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.ఇక ఈ సినిమా తర్వాత బోయపాటి రామ్ పోతినేనితో ''స్కంద'' సినిమా చేయగా ఈ సినిమా సెప్టెంబర్ 28న రిలీజ్ కాబోతుంది.ఈ సినిమాలో మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు.. అలాగే శ్రీనివాస చిట్టూరి భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మరి ఈ సినిమా కూడా అఖండ సినిమాలా బ్లాక్ బస్టర్ అవుతుందో లేదంటే అట్టర్ ప్లాప్ అయ్యి షాక్ ఇస్తుందో చూడాలి.

కాగా ఈ సినిమా రిలీజ్ కాకుండానే బోయపాటి తన లైనప్ ను స్ట్రాంగ్ గా సెట్ చేసుకుంటున్నట్టు తెలుస్తుంది.   ప్రజెంట్ స్కంద ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న బోయపాటి ఆల్రెడీ మూడు సినిమాలను లైన్లో పెట్టుకున్నట్టు టాక్.. స్కంద తర్వాత బాలయ్య, బోయపాటి కాంబోలో మరో సినిమా తెరకెక్కనుంది.. ఈ సినిమా కూడా అయ్యాక బోయపాటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను  లైన్లో సెట్ చేసుకోవాలని ఆలోచిస్తున్నారట..

ఇప్పటికే కథ సిద్ధం చేసుకున్నాడట.. త్వరలోనే అల్లు అర్జున్ కు వినిపించి ఓకే అంటే బాలయ్య మూవీ తర్వాత ఈ సినిమా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది.ఇక తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తుంది. బాలయ్య, అల్లు అర్జున్ తర్వాత బోయపాటి మరో స్టార్ హీరోను లైన్లో పెట్టుకున్నారట. అది కూడా కోలీవుడ్ స్టార్ హీరో అయినా సూర్యతో సినిమా చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఇద్దరి మధ్య కథ గురించి డిస్కర్షన్స్ కూడా జరిగినట్టు టాక్.. ప్రస్తుతానికి మాటల స్టేజ్ లోనే ఉన్న ఈ సినిమా సెట్స్ మీదకు రావడానికి చాలా సమయం ఉందట.

మరింత సమాచారం తెలుసుకోండి: