జవాన్: షారుఖ్ ఖాతాలో మరో సాలిడ్ రికార్డ్?

బాలీవుడ్ టాప్ హీరోగా దూసుకుపోతున్న కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ కి హిట్ కొడితే.. బాక్సాఫీస్ దగ్గర 1000 కోట్లకి పైగా గ్రాస్ వచ్చి పడుతుంది.ఈ ఏడాది షారుఖ్ ఖాన్ నుంచి వచ్చిన పఠాన్ సినిమా జస్ట్ యావరేజ్ కంటెంట్ తోనే థియేటర్స్ లో వచ్చింది. అయినా కానీ ఈ సినిమా రికార్డు వసూళ్లు కొల్లగొట్టింది. ఈ తర్వాత తమిళ దర్శకుణ్ణి బాలీవుడ్ లో పరిచయం చేసి చేసిన సినిమా “జవాన్”కూడా అదరగోడుతుంది. కాగా ఈ భారీ సినిమా షారుఖ్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కింది. ఇదీ యావరేజ్ కంటెంట్ తోనే వచ్చింది కానీ షారుఖ్ ఖాన్ మాస్ ప్రెజెన్స్ అయితే సినిమాని నెక్స్ట్ లెవెల్లో నిలబెట్టి ఏకంగా 1000 కోట్ల దిశగా తీసుకెలుతుంది.కాగా ఇన్ని రోజులు సెన్సేషనల్ వసూళ్లు కంటిన్యూ చేసిన ఈ సినిమా ఇప్పుడు లేటెస్ట్ గా 950 కోట్ల మార్కుని దాటేసి రికార్డు వసూళ్లు 1000 కోట్ల గ్రాస్ కి దూసుకువెళ్తుంది. 


దీనితో వరుసగా రెండు 1000 కోట్ల గ్రాస్ ఉన్న ఇండియన్ హీరోగా షారుఖ్ ఖాన్ ఇప్పుడు  నిలవబోతున్నాడు.మొత్తంగా ఇప్పటివరకు ఈ సినిమా 954 కోట్లు ప్రపంచ వ్యాప్తంగా అందుకోగా బాలీవుడ్ లో తన పఠాన్ సినిమా రికార్డులు తానే బ్రేక్ చేసుకునే దిశగా ఇపుడు షారుఖ్ ఖాన్ వెళ్తున్నాడు. ఇంకా అంతే కాకుండా ఇక ఇది కూడా వీకెండ్ కాబట్టి సుమారుగా 1000 కోట్ల దగ్గరకి వసూళ్లు వచ్చినా వాటిని క్రాస్ చేసినా ఎలాంటి ఆశ్చర్యం లేదు అని కూడా చెప్పొచ్చు. మొత్తానికి ఇలా జవాన్ సినిమా హవా వరల్డ్ వైడ్ గా ఇంకా బాగా నడుస్తుంది. లేటెస్ట్ గా ఈ సినిమా అష్ట్రేలియాలో ఏకంగా 4మిలియన్ డాలర్ మార్క్ అందుకొని సూపర్ రికార్డ్ అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: