తోపు కథలతో బ్లాక్ బస్టర్ మూవీస్ చేస్తూ సౌత్ లో పెద్ద స్టార్ డైరెక్టర్ లలో ఒకడిగా లోకేష్ కనగరాజ్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం మరో పెద్ద స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ తో లోకేష్ లియో మూవీతో ప్రేక్షకుల ముందుకి రావడానికి సిద్ధమవుతున్నాడు.ఈ సారి పాన్ ఇండియా లెవల్ లో తన సినిమాతో సత్తా చాటాలని లోకేష్ గట్టిగా ప్రయత్నం చేస్తున్నాడు. ఈ మూవీ అక్టోబర్ 19న ఏకంగా ఐదు భాషలలో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబందించిన బిజినెస్ డీల్స్ కూడా క్లోజ్ అయినట్లు సమాచారం తెలుస్తోంది. భారీ అంచనాల మధ్య ఈ మూవీ థియేటర్స్ లోకి రావడానికి రెడీ అవుతోంది. రెగ్యులర్ గా మూవీ పోస్టర్స్ రిలీజ్ చేస్తూ సినిమాపై అంచనాలు పెంచే ప్రయత్నం డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ చేస్తున్నారు.


ఇదిలా ఉంటే ఈ సినిమా రన్ టైం నుంచి ఇప్పుడు కోలీవుడ్ సర్కిల్ లో ఇంటరెస్టింగ్ ప్రచారం నడుస్తోంది.ఇక లియో మూవీ 159 నిమిషాల రన్ టైంలోనే ఫైనల్ అవుట్ పుట్ సిద్ధం చేస్తున్నారంట. ఇప్పటికే రన్ టైం లాక్ చేసినట్లు సమాచారం తెలుస్తోంది.మాస్టర్ సినిమా 178 నిమిషాల రన్ టైం ఉంటే విక్రమ్ సినిమా 173 నిమిషాల రన్ టైంతో నడిచింది. ఈ సినిమాలు సక్సెస్ అయిన కూడా లెంత్ విషయంలో కొన్ని విమర్శలు వచ్చాయి. అయితే లియో మూవీ విషయంలో అలాంటి ఛాన్స్ ఇవ్వకుండా ఉండాలని లోకేష్ డిసైడ్ అయ్యాడట.ఇక వచ్చే నెల స్టార్టింగ్ నుంచి పూర్తిగా మూవీ ప్రమోషన్స్ పై లోకేష్ అండ్ కో దృష్టి పెట్టబోతున్నట్లు సమాచారం తెలుస్తోంది. ఈ సినిమాలో త్రిష, సంజయ్ దత్, అర్జున్ వంటి నటులు నటిస్తున్నారు.మరి భారీ అంచనాల మధ్య భారీ టార్గెట్ తో ప్రేక్షకుల ముందుకి రాబోతున్న లియో సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటునేది వేచి చూడాలి.ఇదిలా ఉంటే ఈ సినిమాని కేరళలో బాయ్ కాట్ చెయ్యాలని మోహన్ లాల్ ఫ్యాన్స్ X లో ట్రెండ్ చేస్తున్నారు. అందువల్ల విజయ్ ఫ్యాన్స్, మోహన్ లాల్ ఫ్యాన్స్ కి మధ్య ఫ్యాన్ వార్ నడుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Leo