వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీ తో మంచి గుర్తింపును తెలుగు సినీ పరిశ్రమలో ఏర్పరచుకున్న ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి ఈ సినిమా తర్వాత పరుస తెలుగు సినిమా అవకాశాలను దక్కించుకుంది. అందులో భాగంగా దాదాపు తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోలుగా కొనసాగుతున్న అందరితో కూడా సినిమాలలో నటించి చాలా సంవత్సరాల పాటు టాలీవుడ్ టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగించింది. ఇకపోతే ఈ ముద్దు గుమ్మ చివరగా కొండపొలం అనే తెలుగు మూవీ లో నటించింది. 

మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ప్రస్తుతం రకుల్ తమిళ్ లో కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఇండియన్ 2 మూవీ లో ఓ కీలక పాత్రలో నటిస్తుంది. ఈ మూవీ తో పాటు పలు హిందీ ప్రాజెక్ట్ లలో నటిస్తోంది. ఇకపోతే సినిమాలలో తన అందచందాలను ఆరబోయడానికి పెద్దగా వెనకడుగు వేయకుండా ఇప్పటికే అనేక సినిమాలలో తన స్కిన్ షో తో కుర్రకారును రెచ్చగొట్టిన ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా ఈ మధ్య కాలంలో వరసగా తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. 

ఇకపోతే అప్పుడప్పుడు ఈ ముద్దుగుమ్మ తనకు సంబంధించిన క్లాస్ లుక్ లో ఉన్న ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ బ్యూటిఫుల్ నటి అదిరిపోయే క్లాస్ లుక్ లో ఉన్న ఎల్లో కలర్ డ్రెస్ ను వేసుకొని చేతిలో ఓ బ్యాగ్ పట్టుకొని అంతే క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: