ఆడియన్స్ కి వర్ష అంతకంతకు దగ్గరవుతున్నారు. ఆమె గ్లామర్ కి పడిపోతున్న ప్రేక్షకులు ఫ్యాన్స్ అయిపోతున్నారు. గతంతో పోల్చితే వర్ష పాపులారిటీ పెరిగింది.గ్లామర్ ఫీల్డ్ లో రాణించాలంటే అందాల విందు తప్పనిసరి. అందుకు ఇంస్టాగ్రామ్ వేదికగా మారింది. వెండితెర, బుల్లితెర సెలబ్రిటీలు హాట్ ఫోటో షూట్స్ తో హోరెత్తిస్తున్నారు. జబర్దస్త్ వర్ష సైతం అదే చేస్తున్నారు. తాజాగా సాంప్రదాయ కట్టులో కనిపించిన వర్ష గ్లామర్ యాంగిల్ మాత్రం వదల్లేదు.గతంలో వర్ష పద్దతిగా ఫోటో షూట్స్ చేసేవారు. నిండైన బట్టలో స్కిన్ షోకి దూరంగా ఉండేవారు. ఆమె కూడా పంథా మార్చింది. కొన్నాళ్లుగా షార్ట్స్, స్కర్ట్స్, స్లీవ్ లెస్ డ్రెస్సులో హీటెక్కిస్తోంది.ఇంస్టాగ్రామ్ సెలెబ్రెటీలకు ఆదాయమార్గమైంది. ఫాలోవర్స్ ఆధారంగా బ్రాండ్ వాల్యూ డిసైడ్ చేస్తారు. యాప్స్, ప్రొడక్ట్స్, షో రూమ్స్ ని ప్రమోట్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. అందుకే ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.కొన్నాళ్లుగా వర్ష ఫేమ్ బాగా పెరిగింది. అటు లేడీ కమెడియన్ గా ఇటు సోషల్ మీడియా గ్లామర్ క్వీన్ గా వెలుగొందుతోంది. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి పాపులర్ కామెడీ షోల్లో వర్ష సందడి చేస్తున్నారు. వర్ష బుల్లితెర స్టార్స్ లో ఒకరిగా అవతరించారు.

వర్ష సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించారు. అయితే అక్కడ వర్షకు ఎలాంటి గుర్తింపు రాలేదు. ఆమెను జబర్దస్త్ ఓవర్ నైట్ స్టార్ చేసింది. జబర్దస్త్ ప్రేక్షకులకు వర్ష గ్లామర్ తెగ నచ్చేసింది. లేడీ గెటప్స్ చూసి విసిగిపోయిన జనాలు వర్ష రాకతో ఉపశమనంగా ఫీల్ అయ్యారు. వర్ష ఫేవరేట్ లేడీ కమెడియన్ గా మారిపోయారు.జబర్దస్త్ కమెడియన్ ఇమ్మానియేల్ తో లవ్ ట్రాక్ కూడా వర్షకు కలిసొచ్చింది. తెలివిగా వర్ష తనని తాను ఇమ్మానియేల్ లవర్ గా ప్రేక్షకులకు పరిచయం చేసుకుంది. మరో వైపు ఇమ్మానియేల్ కూడా దెబ్బకు పాప్యులర్ అయ్యారు. వీరిద్దరూ బుల్లితెర క్రేజీ కపుల్ గా మారిపోయారు.

ఈ మధ్య వర్ష ఇమ్మానియేల్ మీద ప్రేమ కురిపించడం తగ్గించింది. అప్పట్లో నువ్వు లేకపోతే నేను లేను అన్నట్లు మాట్లాడేది. బహుశా ఫేమ్ వచ్చాక ఇమ్మానియేల్ అవసరం ఆమెకు అంతగా లేదనుకుంటాను.కెరీర్ కోసం ఇలాంటివి కామనే. సుడిగాలి సుధీర్-రష్మీ గౌతమ్ కెరీర్ కి వారి లవ్ ఎఫైర్ రూమర్స్ ఉపయోగపడ్డాయి. వర్ష కెరీర్ మాత్రం సెట్ అయ్యింది. బయట షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ కూడా వెళుతుంది. ఆ విధంగా కొంత సంపాదిస్తుంది

మరింత సమాచారం తెలుసుకోండి: