ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప పార్ట్ 2 సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను మైత్రి సంస్థ వారు నిర్మిస్తూ ఉండగా ... నేషనల్ క్రష్ రష్మిక మందన ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ లో మలయాళ విలక్షణ నటుడు ఫహాద్ ఫజిల్ విలన్ పాత్రలో నటిస్తూ ఉండగా ... సునీల్ , అనసూయ , రావు రమేష్మూవీ లో ముఖ్య పాత్రలో కనిపించ బోతున్నారు. ఇక పోతే ఈ సినిమా మొదటి భాగం మంచి విజయం సాధించడం తో రెండవ భాగంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న ఈ సినిమా యొక్క రెండవ భాగాన్ని వచ్చే సంవత్సరం ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం ఇప్పటికే అధికారి కంగా ప్రకటించింది. ఇకపోతే తాజాగా ఈ సినిమాలో అల్లు అర్జున్ షూటింగ్ పోర్షన్ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ లో అల్లు అర్జున్ పోర్షన్ కి సంబంధించిన షూటింగ్ జనవరి నటికి పూర్తి చేసే విధంగా చిత్ర బృందం ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ మూవీ లో అల్లు అర్జున్ కు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ జనవరి నాటికి పూర్తి కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ మూవీ బృందం కూడా ఈ సినిమా యొక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులకు కాస్త ఎక్కువ సమయాన్ని తీసుకొని ఈ మూవీ ని అదిరిపోయే రేంజ్ అవుట్ పుట్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేయబోతున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: