చల్ మోహన్ రంగ, లై, డియర్ మేఘ, గుర్తుందా శీతాకాలం వంటి సినిమాలు తో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది మేఘ ఆకాష్. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఇక ఈ ఏడాది అయితే మేఘ ఆకాష్ తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్ గా నటించిన ఆరు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇక ఇప్పుడు మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. 'సఃకుటుంబనాం' అనే పేరుతో తెరకెక్కుతున్న మూవీలో మేఘా ఆకాష్ హీరోయిన్ గా నటిస్తోంది. రామ్ కిరణ్ హీరోగా కనిపించనున్నాడు. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీకి ఉదయ్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. 

ఆదివారం హైదరాబాదులో ఈ చిత్ర ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. హెచ్ ఎన్ జి మూవీస్ సినిమాస్ పతాకంపై హెచ్. మహదేవ్ గౌడ, హెచ్. నాగరత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరో, హీరోయిన్ల పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ కొరియోగ్రాఫర్ చిన్ని ప్రకాష్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, నిర్మాత AM రత్నం క్లాప్ కొట్టారు. చిత్ర నిర్మాత మహాదేవ గౌడ దర్శకుడికి స్క్రిప్ట్ అందజేయగా, ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు ఉదయ్ శర్మ దర్శకత్వం వహించారు. చిత్ర ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ.." కథ వినగానే నిర్మాత ఓకే చేసిన సినిమా ఇది.

 చిత్రంలో తన పాత్ర గురించి చెప్పగానే కొత్త హీరో అని చూడకుండా మేఘా ఆకాష్ వెంటనే ఈ సినిమాకు ఒప్పుకున్నారు. కంప్లీట్ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను" అని అన్నారు. ఆ తర్వాత మేఘా ఆకాష్ మాట్లాడుతూ.." సినిమాలో నా పాత్ర పేరు సిరి. నాకు బాగా నచ్చిన పాత్ర ఇది. ఈ సినిమాలో నటించడం ఎంతో ఆనందంగా ఉంది" అని చెప్పారు. హీరో రామ్ చరణ్ మాట్లాడుతూ.." ఈ సినిమాకి కథే హీరో. ఈ కథను నమ్మి ఇంత మందికి అవకాశం ఇచ్చిన నిర్మాతకు థాంక్స్. అన్ని ఎమోషన్స్ తో కూడిన చాలా శక్తివంతమైన కథ ఇది. ఈ కుటుంబ కథా చిత్రం అందరికీ నచ్చుతుంది" అని అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: